కాలంతో పాటు పరిస్థితులు మారుతాయి అని మన అందరికి తెలిసిన విషయమే. కానీ సినీ పరిశ్రమలో ఆ మార్పులు వీపరీతంగా జరిగిపోయాయి.
“సంవత్సరానికి 150 సినిమాలు చేస్తుంటే 3 సినిమాలు హిట్ అవ్వడమే గగనం అయిపోయింది. ఓన్లీ 2% సక్సెస్ రేటు ఉన్న ఇండస్ట్రీ లో ఉన్నాం. సినిమా మీద ఇంట్రస్ట్ తో సినిమాలు తీస్తున్నాం తప్పా,
కానీ డబ్బులు దొబ్బడానికి కాదు, సినిమా అంటే అభిమానం , ప్యాషన్ రా, ప్రాణం” అంటాడు షియాజీ షిండే నేనింతే సినిమాలో.
ఇప్పుడు కొంతమంది దర్శకులు మాత్రమే ప్యాషన్ తో సినిమాలు చేస్తున్నారు,
నిజంగా సినిమా మీద ఇష్టం తో , గౌరవంతో సినిమాలు తీసే నిర్మాతలు ఉన్నారా అంటే.? లేరు అని చెప్పడానికి మనకు చాలా అడ్డొస్తాయి.
పచ్చ నోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుందని సిరివెన్నెల గారు చెప్పినట్లు. సినిమా అంటే ఇప్పుడు వ్యాపారం. సినిమా చేశామా.? 2 వారాలు థియేటర్ లో ఆడించామా.? మంచి డబ్బులుకి ఏదో ఒక ఓటిటి కి ఇచ్చేసామా.? ఇదే ఇప్పుడు నడుస్తున్న ఫార్ములా.
ఈ రోజుల్లో 100 రోజులు పోస్టర్లు లేవు , ఇన్ని సెంటర్స్ లో ఆడిందని వాల్ పోస్టర్లు లేవు, మళ్ళీ రీ రిలీజ్ లు కూడా లేవు. ఇప్పుడున్నది అంతా కలక్షన్స్ కలక్షన్స్ అంతే.
ఇటువంటి తరుణంలో ట్రిపుల్ ఆర్ సినిమా మళ్ళీ పూర్వ వైభావాన్ని వెనక్కు తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. రీసెంట్ గా 50 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా , ఇంకా ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల ప్రదర్శించబడుతూనే ఉంది. మళ్ళీ ఈ సినిమాని జూన్ 1న యూఎస్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. కొంతమంది సినీ ప్రేమికులకి ఇది ఆనందాన్ని ఇచ్చే విషయం అని చెప్పొచ్చు.