బిగ్ బాస్.. బుల్లితెర లవర్స్ కు పరిచయం అక్కర్లేని పేరు. ఐదు సీజన్లు సక్సస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్, ఈ సారి బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఓటీటీ వర్షన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఐదు సీజన్లు సూపర్ హిట్ కావడంతో ఈ ఓటీటీ వర్షన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐపీఎల్ తో కొంత వరకు పాపులారిటీ తగ్గినా, ఫైనల్ వీక్ కు చేరడంతో మళ్ళీ ఫాంలోకి వచ్చింది. మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ లో ఒక్కొక్కరు గా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ప్రస్తుతం ఫైనల్ రేస్ లో బిందు మాధవి, ఆరియానా, మిత్రా, అఖిల్, బాబా భాస్కర్, అనిల్, యాంకర్ శివలు ఉన్నారు.
అయితే వీరిలో ఆరియానా, అఖిల్, బాబా భాస్కర్, యాంకర్ శివలతో పాటు బిందు మాధవికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మిత్రా, అనిల్ ఫైనల్ వరకు రావడమే గొప్ప కాబట్టి, వీరు ఫైనల్ లో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగితా, ఐదుగురు మధ్య గట్టి పోటీ ఉండనుందని తెలుస్తుంది.
టాప్ 3లో అఖిల్, యాంకర్ శివ, బిందు మాధవి ఉండే అవకాశాలున్నాయి. చివరికి బిందు మాధవి, అఖిల్ మధ్యే టఫ్ ఫైట్ ఉండబోతుందని అంచనా. అయితే విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ కొట్టేది మాత్రం బిందు మాధవి అనే బుల్లితెర వర్గాల్లో టాక్. ఆమెకు మొదటి నుండే ప్రేక్షకుల మద్దతు ఉంది. దీనికి తోడు కోలీవుడ్ నటీ వరలక్ష్మీ శరత్ కుమార్, హీరో హరీష్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు బహిరంగంగానే ప్రకటించారు.
అలాగే సోమవారం స్టార్ట్ అయిన ఓటింగ్ లో బిందు ఫుల్ జోష్ పై ఉన్నట్టు సమాచారం. రెండో రోజు కూడా ఇదే జోరు కొనసాగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ వార్ వన్ సైడ్ అయినా, ఆశ్చర్యపోనవసరం లేదని బుల్లితెర వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏది ఏమైనా తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో తొలిసారి ఓ మహిళా ట్రోఫీని అందుకోబోతుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఇది నిజామో..? కాదో..? తెలియాలంటే.. ఫైనల్ ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.