ప్రతి సారి మన బాడీ ఒకేలా ఉండదు. సందర్భాన్ని బట్టీ సన్నబడచ్చు. లేదా లావు అవచ్చు. లావు అవడం తేలికే, కానీ తర్వాత సన్నబడటం చాలా కష్టం. జిమ్ వర్కౌట్స్, స్పెషల్ డైట్స్ ఫాలో కావాల్సిందే. ఇన్ని బాధలు పడితే కొంత వరకు సన్నబడతారు.
ఈ సొల్లు అంతా ఎందుకు అనుకుంటున్నారా..? ఈ బాధలన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పడుతున్నాడట.
ప్రభాస్.. మంచి ఆహార ప్రియుడని అందరికీ తెలిసిందే. దీని వల్ల ఈ మధ్య కాలంలో ప్రభాస్ కాస్త వెయిట్ పెరిగాడన్నది వాస్తవం. బాహుబలి కోసం తన బాడీ పెంచిన ప్రభాస్, ఆ తర్వాత రిలీజైన సాహో, రాధేశ్యామ్ సినిమాల్లో బాగా లావు అయినట్టు తెలిసిపోతుంది. ప్రభాస్ చాలా లావుగా కనిపించే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “ఏంటి ప్రభాస్.. అప్పుడే అంకుల్ అయ్యాడు“ అంటూ ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. దీంతో ప్రభాస్, సన్నబడే పనిలో పడ్డాడట. ఇక్కడే అసలు సమస్య స్టార్ట్ అయింది.
డార్లింగ్ ప్రస్తుతం ఆది పురుష్ తో పాటు సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, రాజా డిలక్స్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆది పురుష్ షూటింగ్ పూర్తికాగ, సలార్ 30 శాతం, ప్రాజెక్ట్ కే కొంత వరకు షూటింగ్స్ ను జరుపుకున్నాయి. అయితే ఈ సినిమాలకు ప్రభాస్ వెయిట్ పెద్ద సమస్యగా మారిందట. సలార్ లో రెబల్ స్టార్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడట. ఒక పాత్ర లావుగా, మరో పాత్ర సన్నగా ఉంటుందని సమాచారం. దీని కోసం ప్రభాస్, సన్నబడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్.
ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ప్రాజెక్ట్ కే లో, ప్రభాస్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పడు డార్లింగ్ సన్నబడితే, వేరియేషన్స్ కనిపించే అవకాశం ఉంది. సలార్ కోసం సన్నబడితే, ప్రాజెక్ట్ కే కు సమస్యగా మారుతుందని ప్రాజెక్ట్ కే టీం తలపట్టుకుంటుందని తెలుస్తుంది. ఈ సమస్యను ఎలా గట్టెక్కిస్తారో చూడాలి మరి.