Virata Parvam: “విరాటపర్వం” తరువాత.?

సాయి పల్లవి
తెలుగులో చేసినవి చాలా తక్కువ సినిమాలు,
కానీ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది.
కేవలం సాయి పల్లవి కోసమే సినిమాకి వచ్చే ఆడియన్స్ కూడా ఉన్నారు.
అంతలా ఫిదా చేసింది తెలుగు ఆడియన్స్ ను.
కొంతమందికి ఎన్నో సినిమాలు చేసిన రాని గుర్తింపు సాయి పల్లవికి కేవలం 6 సినిమాలతో వచ్చిందని చెప్పొచ్చు.
పల్లవి చేసిన “ఫిదా”, “లవ్ స్టోరీ” , “శ్యామ్ సింగ రాయ్” సినిమాలుమినహా మిగతా సినిమాలు ఊహించిన స్థాయిలో ఆడలేదు.

అయినా కానీ సాయి పల్లవి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
అందం , అభినయం తో పాటు ఈమె వ్యక్తిత్వం కూడా ఇందుకు కారణం అని చెప్పొచ్చు. సాయి పల్లవి చేసిన “పడి పడి లేచే మనసు” సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వని తరుణంలో ఈమె రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చింది అనే వార్తలు అప్పట్లో ఫిలిం నగర్ లో చక్కెర్లు కొట్టాయి.

ప్రస్తుతం సాయి పల్లవి ‘విరాటపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో కనిపించనుంది సాయి పల్లవి. వెన్నెల పాత్ర సినిమాకు హైలైట్ కానుందని టీం గట్టిగా ప్రమోట్ చేస్తూ వస్తుంది.

- Advertisement -

ఒక సినిమా జరుగుతున్నప్పుడే ఇంకో సినిమాను లైన్ లో పెట్టుకుంటారు చాలామంది నటీనటులు. కానీ సాయి పల్లవి అందుకు పూర్తి బిన్నంగా వ్యవహరిస్తోంది. విరాటపర్వం సినిమా తరువాత తమిళ్ లో “గార్గి” మినహా తెలుగులో పల్లవి చేయబోయే సినిమా విషయంలో ఇప్పటికి ఒక క్లారిటీ లేదు. సాయి పల్లవి కెరియర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుందా.? లేదా తనకు నచ్చే కథకోసం వెయిట్ చేస్తుందా.? అనేది అభిమానులకి అర్ధం కానీ పరిస్థితి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు