Prabhas: ఆదిపురుష్ ట్రైలర్ డేట్ ఫిక్స్ !

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఆదిపురుష్. వాల్మీకి రచించిన రామాయణ ఇతిహాసం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కికిన ఈ సినిమా విడుదలకి సిద్దమవుతుంది.

గతేడాది జనవరిలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వియఫ్ఎక్స్ కారణంగా ఆలస్యమవుతు వచ్చింది. వచ్చే నెల జూన్ 16న విడుదల తేదీ ప్రకటించిన మూవీ టీం ప్రస్తుతం ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలనే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ కి సెలెక్ట్ అయిన ఈ సినిమాకి సంబందించి ఫైనల్ వెర్షన్ వియఫ్ఎక్స్ కూడిన కొన్ని స్టిల్స్ ట్విట్టర్ లో రిలీజ్ చేసారు. గతంలో పోలిస్తే బెటర్ క్వాలిటీతో ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి.

అయితే ఈ సినిమాకి సంబందించిన 3నిమిషాల నిడివితో ట్రైలర్ విడుదల చేయబోతున్నరంట మేకర్స్. మే8న ట్రైలర్ ని థియేటర్స్ లో రిలీజ్ చేసి ,మే9న డిజిటల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారంట. అయితే గతంలో కూడా ఇదే తరహాలో థియేటర్ లో సినిమా టీజర్ ని రిలీజ్ చేసారు.

- Advertisement -

ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కే, సలార్ సినిమాలతో బిజీ గా ఉన్నాడు. అయితే ఈ సినిమాలన్నిటికీ మే నెల రెండో వారం నుంచి ప్రభాస్ బ్రేక్ ఇవ్వనున్నాడని సమాచారం. ఆదిపురుష్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నారంట. నార్త్ నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఇండియా వైడ్ గా ఉన్న అన్ని స్టేట్స్ లో సినిమాని ప్రమోట్ చేయబోతున్నరంట. తెలుగు రాష్టాల్లో ఈ సినిమాకి సంబంధించి జూన్3న పెద్ద ఎత్తున తిరుపతి యస్ వి గ్రౌండ్స్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ ని కండక్ట్ చేయబోతున్నారని టాక్. ప్రభాస్ కి జోడిగా ఈ సినిమాలో సీతగా కృతి సనన్ నటిస్తుంది. హనుమంతుడిగా సన్నీ సింగ్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.జూన్ 16న ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు