Manchu Manoj: మనోజ్ ని పెళ్లి చేసుకోమని మోహన్ బాబు అడిగినా నో చెప్పిన హీరోయిన్..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా పేరు దక్కించుకొని భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. వీరి వారసులు మంచు మనోజ్, మంచు విష్ణు కూడా హీరోలుగా ఇండస్ట్రీలో చలామణి అవుతున్న విషయం తెలిసిందే.. ఇకపోతే చిత్ర పరిశ్రమలో ఉండే సెలెబ్రిటీలు కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.. అలా ఎదుర్కొన్న వారిలో మంచు మనోజ్ కూడా ఒకరు.. గత ఏడాది మంచు మనోజ్.. భూమా మౌనికను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మౌనిక త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది.. ప్రస్తుతం ఈ జంట సంతోషంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు..

ఇకపోతే వీరు వివాహం చేసుకున్నప్పుడు చాలా రూమర్స్ వినిపించాయి.. కుటుంబ సభ్యులకి ఇష్టం లేకపోయినా మంచి మనోజ్ మౌనికను వివాహం చేసుకున్నాడు అంటూ కామెంట్లు వినిపించాయి.. అయితే మంచు లక్ష్మి దగ్గర ఉండి మరీ మనోజ్ – మౌనికలకు వివాహం జరిపించింది. ఇదిలా ఉండగా మనోజ్ పెళ్లి విషయంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది.. అయితే మంచు మనోజ్ పెళ్లి విషయంలో ఇప్పుడు మరో కోణం బయటకు వచ్చింది.మోహన్ బాబు నటించి, నిర్మించిన మేజర్ చంద్రకాంత్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ట నటించింది. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ తో పాటు చాలామంది హీరోల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించింది..

ఇకపోతే మేజర్ చంద్రకాంత్ సినిమాలో మంచు మనోజ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.. అప్పటినుంచి వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. శ్రేష్ట యూఎస్ లో చదువుకొని ఇండియాకి తిరిగి వచ్చింది. ఇప్పుడు ఆమె గ్లామర్ గా ఉన్నప్పటికీ కాస్త బొద్దుగా ఉందని చెప్పాలి.. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది శ్రేష్ట. మంచు ఫ్యామిలీ నుంచి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందంట కదా అని అడిగితే.. సిగ్గుపడుతూ దాని గురించి వద్దులే అని బదులిచ్చింది ..యాంకర్ చెప్పమని మరోసారి రిక్వెస్ట్ చేయడంతో.. అవును వచ్చింది.. మంచు మనోజ్ ని చేసుకోమని అప్రోచ్ అయ్యారు అంటూ తెలిపింది..
అయితే ఎవరు అప్రోచ్ అయ్యారు అని యాంకర్ అడిగితే మోహన్ బాబు మా పేరెంట్స్ ని ఇంటికి వచ్చి అడిగారు .. కానీ నేనే నో చెప్పాను అని ఆమె తెలిపింది.

- Advertisement -

ఎందుకు అని యాంకర్ అడగగా.. అవన్నీ ఇప్పుడు వద్దు అంటూ దాటవేసింది శ్రేష్ట.. అయితే ఈ విషయాలు విన్న తర్వాత అభిమానులలో పలు రకాల అనుమానాలు మొదలయ్యాయి మోహన్ బాబు మంచు మనోజ్ ని మొదటి పెళ్లి కోసం అడిగారా లేక రెండవ పెళ్లి కోసమా.. దీని పై క్లారిటీ వస్తే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొదట భార్యతో విడిపోయిన మనోజ్ భూమా మౌనికను వివాహం చేసుకున్నాను.. ఇక శ్రేష్ట విషయానికి వస్తే.. రౌడీ అల్లుడు, హిట్లర్ , సమరసింహారెడ్డి వంటి చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు