Roja: హీరోయిన్ రోజా పై నటి మాధవి రెడ్డి షాకింగ్ కామెంట్స్..!!

అలనాటి హీరోయిన్లలో ఒకరైన హీరోయిన్ రోజా గురించి చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రోజా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి సినిమాలలో కూడా నటించింది.. ముఖ్యంగా తమిళ్ , తెలుగు భాషల్లో ఈమె ఎక్కువ సినిమాలలో నటించి స్టార్ డం ని అందుకున్నారు..అంతేకాదు ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన రోజా.. రాజకీయాలలో కూడా ఎంట్రీ ఇవ్వడంతో సినిమాలకు కాస్త దూరమయ్యారు. ఇలాంటి సమయంలోనే ఎన్నో స్ట్రగుల్స్ కూడా ఎదుర్కొన్న రోజా చివరికి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మంత్రి కూడా అయ్యారు.

జబర్దస్త్ ద్వారా కెరియర్..
గతంలో జబర్దస్త్ షో కి జడ్జిగా కూడా వ్యవహరించి భారీ క్రేజ్ ను అందుకున్న ఈమె ఈ షో ద్వారా బుల్లితెర ఆడియన్స్ కి కూడా మరింత దగ్గర అయింది.. రోజా సినిమాలలో కంటే జబర్దస్త్ ద్వారానే భారీ క్రేజ్ ను అందుకోవడం గమనార్హం..

రోజా సినిమా కెరియర్..
రోజా కెరియర్ 1991లో ప్రేమ తపస్సు అనే చిత్రం ద్వారా మొదలయ్యింది.. ఇందులో హీరో రాజేంద్రప్రసాద్.. ఆయనకు జోడిగా రోజా కూడా నటించారు.. ఇందులో ఈమె పాత్రకి సంబంధించి షాకింగ్ విషయాలను తెలియజేసింది నటి మాధవి రెడ్డి.. ఒక మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించింది..

- Advertisement -

రోజాపై మాధవి రెడ్డి షాకింగ్ కామెంట్స్..
రోజా తాను క్లాస్మేట్స్ అని, తిరుపతిలో డిగ్రీ చదివేటప్పుడు తామిద్దరం క్లాస్మేట్స్ అని వెల్లడించింది. ఆమె స్టడీస్ లో ఫస్ట్ ఉండేదని, చాలా తెలివైనదని తెలిపింది మాధవి రెడ్డి.. అయితే నేను ఎంబిబిఎస్ చేయాలని కాలేజీకి సరిగ్గా వెళ్లలేదు.. దీంతో రోజాతో అంత క్లోజ్ గా మూవ్ అయ్యేదాన్ని కాదు.. కానీ మామూలు పరిచయమైతే ఉండేది.. ఆమెకు ప్రేమ తపస్సులో అవకాశం వచ్చినప్పుడు షూటింగ్ కి నేను కూడా వెళ్ళాను.. అందులో రోజా పని మనిషి పాత్ర పోషించింది.. దీంతో పనిమనిషి పాత్ర కరెక్ట్ గా సరిపోయిందని.. నల్లగా ఉన్నావని ఎగతాళి చేశాము అంటూ తెలిపింది మాధవి రెడ్డి.

అయితే ఆ తర్వాత మోడ్రన్ మహాలక్ష్మి షో కి స్పెషల్ ఎపిసోడ్ జరుగుతున్న సమయంలో మళ్లీ కలిసాము.. అయితే ఆమె పెద్దగా గుర్తుపట్టలేదు కానీ నేను అయితే కామ్ గా ఉన్నానని తెలిపింది మాధవి రెడ్డి.. రోజాకి తమిళంలో చేసిన మూవీ తో బ్రేక్ వచ్చింది.దీంతో ఒక స్టార్ హీరోయిన్గా మారిపోయింది.. వరుసగా ఎన్నో అవకాశాలు వచ్చాయి అంటూ తెలిపింది మాధవి రెడ్డి.. పొలిటికల్ పరంగా కూడా బాగానే రాణిస్తోంది ఆమె ఇంటెలిజెంట్ పర్సన్ అని.. తన మాట తీరు కూడా చాలా ధైర్యంగా ఉంటుందని.. అందుకే రాణిస్తోందంటూ వెల్లడించింది. మంత్రిగా ఎదిగిన తీరు చూసి ఆమెను ప్రశంసించింది నటి మాధవి రెడ్డి.. మొత్తానికైతే రోజా గురించి నటి మాధవి రెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు