Aaradhyadevi: ఆ కర్వ్స్ కోసం ఎన్నో కష్టాలు, అవమానాలు.. శారీ బ్యూటీ ఏజ్ తెలిస్తే షాక్..!

Aaradhyadevi: ఆరాధ్య దేవి.. ఈ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చే పేరు వర్మ ..అమ్మాయిల లోని అందాలను వెలికి తీయడంలో ఈయన ప్రథమ స్థానంలో ఉంటాడు. అందుకే ఈమె గురించి ఎవరికీ తెలియకపోయినా ఎక్కడో ఒక ఫోటో పట్టుకొని ఈమె ఎవరో తెలుసుకొని మరీ ఆమెలోని అందచందాలను బయటకు తీసి ఆమెను ఇప్పుడు హీరోయిన్ చేయబోతున్నారు… ముఖ్యంగా ఈమె వెలుగులోకి వచ్చి సక్సెస్ అయిందంటే ఆ క్రెడిట్ మొత్తం వర్మాకే చెందుతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మతో శారీ అనే సినిమా తీస్తున్నారు రామ్ గోపాల్ వర్మ..

వర్మ వల్లే స్టార్ స్టేటస్..

నిజానికి సోషల్ మీడియా ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది.. నెట్టింట రీల్స్ చేసి సినిమాల్లోకి అడుగు పెట్టిన వారు కూడా ఉన్నారు.. ఓకే ఒక రీల్ వీడియోతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిన ముద్దుగుమ్మలు ఉన్నారు .అలాంటి వారిలో శ్రీ లక్ష్మీ సతీష్ కూడా ఒకరు.. ఈ పేరు అంతగా ఫేమస్ కాలేదు.. కానీ వర్మ ఆరాధ్య దేవి అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు . చీర కట్టు తో ఇన్స్టా రీలు, వీడియోస్ చేసుకుంటూ ఉండే శ్రీ లక్ష్మీ సతీష్ .. డైరెక్టర్ ఆర్జీవి కంటపడింది . దీంతో ఈమె గురించి వరుసగా పోస్టులు పెట్టిన వర్మ చివరికి ఆమెతో శారీ అనే సినిమా చేస్తున్నారు.. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ నెటిజెన్లలో ఒక కొత్త ఆలోచనను, కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. దీంతో శ్రీలక్ష్మికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఇక వర్మ చేసిన పోస్టుల వల్లే ఈమె మరింత పాపులారిటీ సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈమె శారీ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే ఈమె ఎప్పుడు ఫొటోస్ , రీల్స్ షేర్ చేస్తూ అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు చెబుతూ ఉంటుంది.

అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన ఆరాధ్య దేవి..

Aaradhyadevi: Many hardships and insults for those curves.. Shari's beauty age will be a shock..!
Aaradhyadevi: Many hardships and insults for those curves.. Shari’s beauty age will be a shock..!

ఇక తాజాగా ఇన్స్టా లో చిట్ చాట్ నిర్వహించిన ఆరాధ్య దేవి.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు తెలిపింది. ఇందులో భాగంగానే మీ ఏజ్ ఎంత అని ఒక నెటిజన్ అడగగా.. 22 అని తెలిపింది. అలాగే కొంచెం కొంచెం తెలుగు వస్తుందని.. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానని కూడా చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం తాను హైదరాబాదులో శారీ మూవీ షూటింగ్ చేస్తున్నట్లు తెలిపింది. తన హైట్ 5 ఫీట్ 8 ఇంచెస్ అని కూడా తెలిపింది..

- Advertisement -

ఆ కర్వ్స్ వెనుక ఎంతో కష్టం ఉంది..

ఇందులో భాగంగానే ఒక నేటిజన్ నీ షేప్ , కర్వ్స్ అంటే చాలా ఇష్టం.. అదే నీలోని అందం అంటూ కామెంట్ చేయగా.. ఆ కర్వ్స్ అంత ఈజీగా రాలేదు.. ఎన్నో త్యాగాలు చేశాను.. చాలా వర్కౌట్స్ చేసి..కష్టపడితేనే అది వచ్చింది అంటూ తెలిపింది.. అంతే కాదు ఒకప్పుడు తనమీద బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చాయని.. ఆ ట్రోలింగ్ భరించలేక ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడి వర్కౌట్ చేసి ఆ షేప్ సొంతం చేసుకున్నానని తెలిపింది. ఇక తనకు శ్రీదేవి అంటే ఇష్టం అని అందుకే ఎక్కువగా చీరలు కడతానని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. మరి శారీ సినిమాలో నటిస్తున్న ఈమె ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు