35Years Of Sahasame NaaOopiri : నటశేఖర “కృష్ణ” రాజకీయ సాహసానికి 35ఏళ్ళు.. ఎన్నో వివాదాల వంగవీటి మిస్టరీ పై సినిమా..

35Years Of Sahasame NaaOopiri : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘నటశేఖర కృష్ణ’ ఆరు దశాబ్దాల పాటు తన సినీ ప్రయాణాన్ని అద్భుతంగా కొనసాగించారు. ఇక డేరింగ్ డాషింగ్ హీరోగా అప్పట్లోనే విభిన్నమైన చిత్రాలు చేసి రికార్డులు సృష్టించారు “కృష్ణ”. ఒక్క హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా పలు చిత్రాలు తెరకెక్కించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రశంసలందుకున్నారు. ఇక అప్పట్లో ఎన్నో సినిమాలతో కృష్ణ చేసినన్ని సాహసాలు, ప్రయోగాలు ఎవరూ చేయలేరని అంటుంటారు. తెలుగు సినిమాల్లో ఫస్ట్ స్పై థ్రిల్లర్స్, ఫస్ట్ కౌ బాయ్ మూవీ లాంటి చిత్రాలతో పాటు, ఫస్ట్ 70MM సినిమా, ఫస్ట్ స్టీరియో స్కోప్ సినిమాలు తెరకెక్కించి అరుదైన ఘనత సాధించారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అయితే అప్పట్లో రాజకీయాల్లో ఎన్టీఆర్ కృష్ణ మధ్య పలు వివాదాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ లో ఉన్న కృష్ణ అప్పట్లోనే ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సినిమాలు తీయడం గమనార్హం. అలా తీసిన చిత్రాల్లో ప్రేక్షకులకు చేరువై ప్రజాదరణ పొందిన చిత్రాల్లో “సాహసమే నా ఊపిరి” చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా అప్పటి రాజకీయ నాయకుడు వంగవీటి మోహన్ రంగ దారుణహత్య కి సంబంధించిన కథాంశం నేపథ్యంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమా (35Years Of Sahasame NaaOopiri) విడుదలై నేటికీ 35 వసంతాలు అయింది. ఈ సందర్భంగా అప్పటి రాజకీయ రగడకు కారణమైన విశేషాలపై కొన్నిటిని చర్చిద్దాం..

35Years Of Sahasame NaaOopiri Movie

వంగవీటి హత్య నేపథ్యంలో కథ…

ఇక సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గానూ ఉన్న సంగతి తెలిసిందే. తొలుత తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తల్లో ఎన్టీఆర్ కి సపోర్ట్ గా సినిమా తీసిన కృష్ణ, ఆ తర్వాత రాజకీయాల్లో ఆయన ప్రవేశ పెట్టిన కొన్ని విధానాలు నచ్చక విభేదించారు. ఆ తర్వాత 1984 లో కాంగ్రెస్ కి మద్దతుగా నిలుస్తూ, సినిమాలు తీశారు. అప్పట్లోనే “నా పిలుపే ప్రభంజనం” పేరుతో ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సినిమా తీసి సంచలనం సృష్టించారు కృష్ణ. ఆ తర్వాత దీనికి మరోసారి ఇలాంటి చిత్రాన్ని ప్రేరణ గా తీసుకుని “సాహసమే నా ఊపిరి” పేరుతో సినిమా తీసి పెను సంచలనం సృష్టించారు కృష్ణ. 1988 లో విజయవాడకి చెందిన రాజకీయ నాయకుడు “వంగవీటి మోహన రంగా” దారుణ హత్య ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో వంగవీటి మోహన్ రంగ హత్య సంఘటన ఆధారంగా, అప్పటి టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది.

- Advertisement -

35Years Of Sahasame NaaOopiri Movie

రాజకీయంగా… సినిమా పరంగా ప్రత్యక్ష యుద్ధం..

కృష్ణ నటించిన “సాహసమే నా ఊపిరి” చిత్రాన్ని అప్పటి లేడీ డాషింగ్ డైరెక్టర్ కృష్ణ భార్య అయిన విజయ నిర్మల దర్శకత్వం వహించడం జరిగింది. అలాగే ఈ చిత్రంలో కృష్ణ, విజయ నిర్మల తో పాటు నరేష్, వాణి విశ్వనాథ్, గుమ్మడి వెంకటేశ్వరరావు, ప్రధాన పాత్రల్లో నటించగా, సింహపురి సుధాకర్ అనే కొత్త వ్యక్తి చేత ఎన్టీఆర్ పాత్రని పోలిన ‘కోదండ రామయ్య’ అనే పాత్రలో నటింప చేసారు. పార్టీ పేరు కూడా “త్రిలింగ దేశం” అని పెట్టడం జరిగింది. ఇక ఈ చిత్రంలో కృష్ణ కేంద్రం నుండి ప్రత్యేకంగా నియమించబడ్డ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఇక ఈ చిత్రానికి పి.చంద్రశేఖరరెడ్డి రాసిన కథకు విజయ నిర్మల చిత్రానువాదం రాయగా, త్రిపురనేని మహారథి సంభాషణలు రాశాడు. విద్యాసాగర్ ఈ సంగీతాన్ని ఇచ్చాడు. ఈ చిత్రం 1989 మే 25 న విడుదలైన సాహసమే నా ఊపిరి సినిమా మంచి సాధించింది. అయితే సూపర్ స్టార్ కృష్ణకు – ఎన్టీఆర్ కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం గరిష్ఠ స్థాయికి చేరుకున్న సమయంలో ఇది విడుదలైంది.

ఎన్నో వివాదాలు, విమర్శలు.. గొడవలు..

ఇక సాహసమే నా ఊపిరి చిత్రంలో అప్పటి కొన్ని వార్తాపత్రికలు ఆరోపించినట్లు రాజకీయ నాయకుడు వంగవీటి మోహన రంగాను దారుణంగా హత్య చేసిన కేసులో ఎన్టీఆర్ ఎలా పాత్ర పోషించి ఉండవచ్చో ఈ చిత్రంలో నొక్కి చెప్పారు. అందువల్ల, ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వచ్చింది. అయినా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం మంచి వసూళ్ళే సాధించింది. ఈ చిత్రం కొన్ని కేంద్రాలలో 50 రోజులు నడిచింది. వాటిలో 4 రాయలసీమకు చెందినవి. ఇది కృష్ణ చిత్రానికి చాలా ఎక్కువ. ఇక గుంటూరులో ఈ సినిమా 100 రోజులు ఆడడం విశేషం. అయితే అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించగా, చాలామంది రాష్ట్ర మంత్రులను, శాసనసభ్యులను కలవరపరిచాయి. ఆ తర్వాత కూడా కృష్ణ కొన్ని సినిమాలు ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా తీశారు. ఇక 1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కృష్ణ ఓడిపోవడం, ఆ సమయంలోనే కృష్ణ ని ప్రోత్సహించిన రాజీవ్ గాంధీ చనిపోవడంతో కృష్ణ రాజకీయాల నుండి తప్పుకున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు