Krishna: తెలుగు ఇండస్ట్రీలో అలాంటి ఘనత కృష్ణ కే సాధ్యమా..?

Krishna..గతంలో ఉన్న సినిమాలకు ప్రస్తుతం ఉన్న సినిమాలకు మధ్య టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాల VFX ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అలాగే పలు రకాల డిఫరెంట్ లొకేషన్ లలో సినిమాలను చిత్రీకరించడం కూడా తెలుగు సినీ పరిశ్రమకు బాగా కలిసి వస్తోంది. అంతేకాకుండా ఎన్నో చిత్రాలలో కూడా ఇతరత్రా లొకేషన్లను వింతగా చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుతం హోండా టెక్నాలజీతో అద్భుతమైన విజువల్స్ తో మాయ చేస్తూ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం భారీ ఖర్చుతో ఎక్కడైనా సరే సినిమాలను తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం.

44 ఏళ్ల క్రితమే అమెరికాలో సినిమా షూటింగ్.

కానీ 44 ఏళ్ళ క్రితమే ఫారెన్ లో సినిమా షూటింగ్ అంటే అది చాలా గొప్ప విషయమని చెప్పవచ్చు.. అలాంటి గొప్ప సాహసం చేయగలిగిన ఏకైక నటులు దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే.. ఇలాంటి అరుదైన అద్భుతాలను సృష్టించేది కేవలం కృష్ణ మాత్రమే అని చెప్పవచ్చు.. 1980లో అగ్రరాజ్యంగా పిలవబడే అమెరికాలో కూడా షూటింగ్ జరిపారు కృష్ణ. సినిమాల విషయంలో కృష్ణకు ఎన్నో రికార్డులు సైతం ఉన్నాయి.. మొట్టమొదటి జేమ్స్ బాండ్ సినిమా చేసిన హీరోగా పేరు పొందడమే కాకుండా దాదాపుగా ఒకే ఏడాది 17 సినిమాలలో నటించిన ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ.

Krishna: Is it possible for Krishna to achieve such a feat in the Telugu industry?
Krishna: Is it possible for Krishna to achieve such a feat in the Telugu industry?

అమెరికాలో సినిమా తీసిన మొట్టమొదటి హీరో కృష్ణ..

- Advertisement -

అంతేకాకుండా మొట్టమొదటి సారి తెలుగు సినిమాను అమెరికాలో తీసిన ఘనత కృష్ణనే అందుకున్నారు.ఆ చిత్రమే ‘హరే కృష్ణ హలో రాధ ‘.. ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా శ్రీధర్ అందించారట. ఇందులో కృష్ణకు జోడిగా శ్రీ ప్రియ, పతి అగ్నిహోత్రి హీరోయిన్స్ గా నటించారు.. ఈ చిత్రం 1980 అక్టోబర్ 16న థియేటర్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో పూర్తి భాగంలో 3 వంతుల భాగం మొత్తం అమెరికాలోని తీశారు. నిజానికి కృష్ణ మొదట తమిళ సినిమాతో పరిచయం కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల చేత అది ఆలస్యం అయ్యిందట.

శ్రీధర్ – కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన చిత్రమే హరే కృష్ణ హలో రాధ..

ఆ తర్వాత శ్రీధర్ , కృష్ణ కాంబినేషన్లో ఇలాంటి సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే వీరి కాంబినేషన్ సెట్ కావడానికి దాదాపుగా 15 ఏళ్లు పట్టిందట. అయితే మొదట ఈ సినిమా షూటింగ్ ను సెట్లో కాకుండా అమెరికాలోనే చిత్రించాలని విధంగానే ఈ సినిమా స్టోరీని డెవలప్మెంట్ చేశారట డైరెక్టర్ శ్రీధర్.. ఏది ఏమైనా సూపర్ స్టార్ కృష్ణ మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన క్రియేట్ చేసిన రికార్డులు సైతం అందరికీ గుర్తున్నాయి. అంతేకాదు ఆయన సృష్టించిన అద్భుతాలే నేటికీ ఎన్నో సినిమాలకు పని చేస్తున్నాయని చెప్పవచ్చు.. ఇక సూపర్ స్టార్ కృష్ణ కరోనా సమయంలో అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే ఇక ఆయన వారసుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో యాక్షన్ అడ్వెంచర్ మూవీ ని తెరకెక్కిస్తున్నారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు