Life style : ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? ఇలా చేస్తే 5 నిమిషాల్లో మటుమాయం

ప్రస్తుతం మనం గడుపుతున్న ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యం విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం గందరగోళంగా మారుతుంది. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. నిరంతరం ఆలోచనల్లో మునిగిపోవడం, సమయానికి తినకపోవడం, ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోవడం, ఎక్కువ సమయాన్ని సిస్టమ్స్, ఫోన్లు చూడడానికి, సోషల్ మీడియా వాడకం కోసం ఉపయోగించడం, సరిగ్గా నిద్ర పోకపోవడం వంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు నేటితరం యువత. ముఖ్యంగా సమస్యల వల్ల దీర్ఘాలోచనలో పడి అతిగా ఆలోచిస్తూ టెన్షన్ తీసుకుంటున్నారు. వాళ్లు పడుతున్న టెన్షన్ మొహంపై వాడిపోతుంది. ఇంకేమీ ఆలోచించలేకపోతున్నారు. చాలామంది శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

కానీ మానసిక ఆరోగ్యంపై మాత్రం పెద్దగా శ్రద్ధ చూపరు. దానివల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ప్రతిరోజు చిరాకు, ఒత్తిడి, అలసట వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మరి ఒత్తిడిని తట్టుకోలేక ఇబ్బంది పడేవారు మనసును ప్రశాంతంగా రిలాక్స్డ్ గా ఉంచుకోవడానికి, క్షణాల్లో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. దానికోసం పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. అలాగని గంటల తరబడి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు. ఒత్తిడి మటుమయం అయిపోతుంది. మరి ఇంతకీ ఆ అద్భుతమైన రెమిడి ఏంటి అంటే జ్ఞాన ముద్ర. ఈ యోగ ముద్ర చిరాకును తగ్గించడంలో సహాయపడి ఒత్తిడిని మాయం చేస్తుందని చెప్తున్నారు యోగా నిపుణులు. మరి ఇంతకీ జ్ఞాన ముద్ర యోగాసనాన్ని ఎలా వేయాలి? దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

జ్ఞాన ముద్ర…
ధ్యాన భంగిమలో కూర్చుని ఈ ఆసనాన్ని వేస్తారు. నడుము, మెడను నిటారుగా ఉంచి స్ట్రైట్ గా కూర్చోవాలి. ఆ తర్వాత రెండు చేతుల చూపుడు వేళ్ల చివర్లను వంచి బొటనవేలుతో కలపాలి. మిగిలిన 3 వేళ్లను స్ట్రయిట్ గా ఉంచాలి. చివరగా సౌకర్యవంతంగా కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో ఐదు నిమిషాలు కూర్చోవాలి.

- Advertisement -

జ్ఞాన ముద్ర ఉపయోగాలు…
1. జ్ఞానముద్ర ఆసనాన్ని వేయడం వల్ల మెదడులో నరాలు బలపడతాయి.
2. జ్ఞాపకశక్తి, సహనం, ఏకాగ్రత మానసిక శక్తి పెరుగుతాయి. తెలివి మరింత పెరుగుతుంది.
3. తలనొప్పి నిద్రలేమి వంటి సమస్యలకు కూడా ఈ ఆసనం మంచి మెడిసిన్ గా పని చేస్తుంది.
4. మనసును ప్రశాంతంగా ఉంచి కోపం, చిరాకు, ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అందుకే ధ్యానం, ప్రాణాయామ సమయాల్లో ఈ ఆసనాన్ని ఎక్కువగా వేస్తారు.
5. జ్ఞానముద్ర మనసుకు విశ్రాంతిని ఇస్తుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గిపోయి దాని వల్ల వచ్చే తలనొప్పి కూడా మాయమవుతుంది.
6. ప్రతిరోజు ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ ఆసనాన్ని వేసి ధ్యానం చేస్తే ఒత్తిడి నుంచి పూర్తిగా ఉపశమనం పొందొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఒత్తిడితో ఎంతో కాలంగా బాధపడుతూ ఉంటే వెంటనే ఒక్కసారి ఈ ఆసనాన్ని ట్రై చేసి చూడండి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు