Relationship Tips : లవర్ లో ఈ లక్షణాలు ఉంటే బ్రేకప్పే బెటర్

ప్రేమలో పడినప్పుడు ఆ అద్భుతమైన ఫీలింగ్ వర్ణనాతీతంగా ఉంటుంది. కానీ అసలు మీరు ఇష్టపడుతున్న వ్యక్తితో లైఫ్ లాంగ్ సంతోషంగా జీవించగలరా? ఇప్పుడు మేఘాల్లో తేలిపోతున్న ఫీలింగ్ కలిగిస్తున్న అదే ప్రేమ ఒక్కసారి అక్కడి నుంచి కిందకు తోసేసినట్టుగా అనిపించే పరిస్థితి ఎదురైతే? అందుకే ముందుగానే మీరు ఇష్టపడే వ్యక్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి. వాళ్లు మీకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే ముందుకు సాగండి లేదంటే బ్రేకప్ తో ఆ రిలేషన్ షిప్ కు బ్రేక్ ఇచ్చేయండి. అంతేగాని బాధాకరమైన ఎమోషన్స్, పరిష్కారం కానీ వాదనలు, క్షమాపణల కోసం యుద్ధాలు, ఆ క్రమంలో మిమ్మల్ని మీరు కోల్పోతున్నారని భావనలో మునిగిపోవడం వంటివి ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు. అలాంటి రిలేషన్ షిప్ ను కంటిన్యూ చేయడం కన్నా వదిలేయడమే బెటర్. మరి ఇంతకీ ప్రేమలో పడే ముందు అవతలి వ్యక్తి మనకు సెట్ అవుతాడా లేదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి? మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మీకు కరెక్ట్ కాదని ఎలా ప్రూవ్ అవుతుంది? అంటే సైకాలజీ ప్రకారం కొన్ని లక్షణాలను గమనిస్తే సరిపోతుంది.

1. మీ ఆనందం వాళ్లపై ఆధారపడి ఉంటుంది
సాధారణంగా లవ్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు మొదట్లో చాలా ఆప్యాయతతో ఉంటారు. మెసేజ్ లు చేసుకుంటారు, ఒకరిపై ఒకరు పొగడ్తల వర్షం కురిపిస్తారు. ఇద్దరు టైం స్పెండ్ చేస్తారు. కానీ రోజు రోజుకు ఆసక్తి తగ్గి ఏదో ఒక రోజు ఇవన్నీ లేకుండా పోతాయి. అప్పుడు మీకు సంతోషం అనేదే కరువైపోతుంది. అప్పుడు అర్థమవుతుంది మీ ఆనందాన్ని వేరొకరి కోసం తాకట్టు పెట్టేసారని. అంటే వాళ్ళు లేకపోతే ప్రపంచం అంతమైందేమో అనే భావన కలుగుతుంది. డిప్రెషన్ ను గురవుతారు. ఒకరితో ఆనందాన్ని పంచుకోవడం అనేది మంచి విషయమే. కానీ మీ మానసిక శ్రేయస్సు వారి చేతుల్లో ఉండటమే కరెక్ట్ కాదు. మీరు మీకంటే ఎక్కువగా వాళ్ల గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటే ఆ రిలేషన్ షిప్ కు ఫుల్ స్టాప్ పెట్టడమే బెటర్.

2. లవరే సర్వస్వం…
సాధారణంగా లవ్ లో పడ్డ తర్వాత ఎవరైనా సరే తమ పార్ట్నర్ ని బెస్ట్ ఫ్రెండ్ గా భావిస్తారు. వాళ్లు పక్కనుంటే కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారు. గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ ఏదైనా సరే తనతోనే ముందుగా పంచుకోవాలనుకుంటారు. కానీ రాను రాను అదే మీ విషయంలో ఇబ్బందికరంగా మారిపోతుంది. మీ ప్రపంచం అనేది కుచించుకుపోతుంది. కొన్ని రోజుల తర్వాత తిరిగి చూసుకుంటే మీకోసం మీరు ఏం చేసుకున్నారు అనే విషయం కూడా కనీసం గుర్తు రాదు. ఎందుకంటే మీ ప్రపంచం అంతా లవర్ చుట్టూనే తిరుగుతుంది. స్నేహితులు ఉండరు, అభిరుచులు మర్చిపోతారు. టార్గెట్స్ ని పక్కన పెట్టేస్తారు. పర్సనల్ డెవలప్మెంట్ అనేదే మీ జీవితంలో లేకుండా పోతుంది. అంటే మీరు రిలేషన్ షిప్ లో సరైన బౌండరీస్ సెట్ చేయలేదని అర్థం. ప్రేమ అనేది మీ జీవితానికి మరొక మెయిన్ అసెట్ కావాలి. అంతేకానీ మిమ్మల్ని జీవితంలో వెనక్కి లాగేది కాకూడదు.

- Advertisement -

3. మీ ఆత్మగౌరవం దెబ్బతినడం
ప్రతి విమర్శ, తిరస్కార కామెంట్స్, జోక్స్ మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంటే ఆ రిలేషన్షిప్ ను వదులుకోవడమే మంచిది. ప్రేమించిన వ్యక్తితో కలిసి ప్రపంచాన్ని జయించగలగమన్న అనుభూతిని లవర్ కలిగించాలి గానీ, మీరు దేనికి పనికిరారు అన్న ఫీలింగ్ ను తెప్పించేవారు ఎప్పటికీ లైఫ్ పార్ట్నర్ గా సెట్ అవ్వలేరు. మీ విలువను లవర్ గుర్తించలేక పోయినంత మాత్రాన అది తగ్గిపోదు. కాబట్టి మీపై మీరు నమ్మకం ఉంచుకొని ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి.

4. త్యాగాలు చేయాల్సి రావడం
రిలేషన్షిప్ అన్నాక సర్దుకుపోవడం మామూలే. కానీ లవర్ తన కంఫర్ట్ ను మాత్రమే చూసుకుని ప్లాన్స్ వేయడం, మీ అవసరాలకు మీరు రాజీ పడాల్సి రావడం వంటివి జరిగితే ఒకసారి ఆలోచించాల్సిందే. త్యాగాలు ప్రేమను మరింత పెంచుతాయి. కానీ కాలక్రమేణా ఆ త్యాగాల వల్ల మీరు నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కోల్పోతారు. కేవలం మీ లవర్ మాత్రమే నిర్ణయాలు తీసుకునే అధికారం తనకే ఉన్నట్టుగా ఫీల్ అవ్వచ్చు. ప్రేమ అంటే ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవడం. అంతేగాని జీవితాంతం త్యాగాలు చేస్తూ బ్రతికేయడం కాదు.

5. స్నేహితులు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం…
ప్రేమ గుడ్డిది అని తరచుగా చెబుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఆ గుడ్డితనం మరీ ఎక్కువైపోయి మన శ్రేయస్సును కోరేవారు పడుతున్న ఆందోళన కళ్ళకు కనిపించదు. పైగా తప్పుగా అర్థం చేసుకుంటారు. కొంతకాలం గడిస్తేనే గాని వాళ్ళ ఎందుకు టెన్షన్ పడ్డారు అనే విషయం అర్థం కాదు. మీ పట్ల నిజంగా శ్రద్ధ చూపించే వారు మీ సంతోషం తప్ప ఇంకేమి పట్టించుకోరు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

6. ట్రాప్ లో చిక్కుకున్నట్టుగా అనిపించడం… సంతోషంగా ఉండడానికి, పంజరంలో చిక్కుకున్నట్టుగా అనిపించడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. ప్రేమ అనేది ఉచ్చులా మారకూడదు. లవర్ ని వదిలి వెళ్ళడానికి భయపడడం, లేదా మంచి వ్యక్తి దొరకడేమో అనే భయపడడం అనేవి మీరు హెల్దీ రిలేషన్షిప్ లో లేరు అనడానికి సంకేతం. నిజమైన ప్రేమ ఎప్పుడూ డెవలప్మెంట్ ను కోరుకుంటుంది. అంతేగాని నిర్బంధాన్ని కాదు. దీనివల్ల మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. ఒకవేళ ఇదే పరిస్థితిలో మీరుంటే ఆ రిలేషన్షిప్ కు బ్రేకప్ చెప్పేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు