Fahad Faasil : ఆ అరుదైన వ్యాధితో బాధ పడుతున్న ఫహాద్… అందుకేనా ఇంత క్రియేటివిటీ!

Fahad Faasil : విభిన్నమైన సినిమాలతో మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్న మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఫహద్ తాజాగా ఓ ఈవెంట్ లో వెల్లడించడం సంచలనంగా మారింది. ఇంతకీ ఫహాద్ కు ఉన్న ఆ జబ్బు ఏంటి? అంటే…

ఫహద్ కు మానసిక వ్యాధి…

రీసెంట్ గా కొత్తమంగళంలో ఒక పాఠశాల ప్రారంభోత్సవానికి గెస్ట్ గా హాజరైన ఫహాద్ తనకు ఓ మానసిక వ్యాధి ఉందన్న విషయాన్ని ఒప్పుకున్నాడు. 41 ఏళ్ల వయసులో ఉన్న తాను ప్రస్తుతం అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అకా ADHDతో బాధపడుతున్నానని వెల్లడించాడు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు నీడనిచ్చే పీస్ వాల్యూ స్కూల్ ను ప్రారంభించిన సందర్భంగా తనకు ADHD ఉందని వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చాడు.

ఈ వ్యాధి నయమవుతుందా?

ఈ సందర్భంగా ఫహాద్ తనకున్న జబ్బుకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు. అందులో భాగంగానే ఈ వ్యాధి నయమవుతుందా? దాని లక్షణాలు ఏంటి అనే విషయాలను వెల్లడించారు. ఫహాద్ మాట్లాడుతూ ఈ జబ్బు ఈజీగానే తగ్గుతుందా? అని ప్రశ్నించానని, అయితే బాల్యంలో ADHD ఉన్నట్టుగా నిర్ధారణ అయితే దాని నుంచి బయటపడే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పినట్టుగా వెల్లడించారు. అయితే 41 ఏళ్ల వయసులో నిర్ధారణ అయితే అది నయం అవ్వడం కష్టమేనని చెప్పుకొచ్చారు.

- Advertisement -

Fahadh Faasil admits he has reservations about dealing with religion in his films, says Malayalam audience isn't ready for 'harsh reality' | Malayalam News - The Indian Express

ఈ జబ్బు లక్షణాలు…

ఇక ఫహాద్ మాట్లాడుతూ ఈ జబ్బుకు ఉండే లక్షణాలను కూడా వివరించారు. అజాగ్రత్త, హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్, ఇంపల్సివిటి వంటి లక్షణాలు ఈ జబ్బులో ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే ఈ లక్షణాలు ఉన్నవారు తరచుగా నాన్ లీనియర్ పద్ధతిలో ఆలోచిస్తారని, ఇది వారికి సుజాతనాత్మకంగా ఉండడానికి హెల్ప్ అవుతుందని తెలుస్తోంది. ఈ లక్షణాలన్నీ విన్న తర్వాత ఫహాద్ అభిమానులు అందుకే ఆయన ఇంత క్రియేటివ్ గా ఉంటారా ? అని అడుగుతున్నారు.

ADHD ఉన్న స్టార్స్

గతంలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు తమకు ADHD ఉన్నట్టుగా ఒప్పుకున్నారు. ఆ లిస్ట్ లో ర్యాన్ గోస్లిన్, జస్టిన్ టింబర్ లేక్, విల్ స్మిత్, చానింగ్ టాటమ్, జిమ్ క్యారీ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఏమ్మా వాట్సన్ తదితరులు ఉన్నారు. ఒకవేళ ADHD ఉందనే విషయం ఫహాద్ లాగా జీవితంలో ఆలస్యంగా తెలిస్తే వైద్య, మానసిక లైఫ్ స్టైల్ కు సంబంధించిన విషయాలను మిళితం చేసి దీన్ని ఎలా మేనేజ్ చేయాలో సూచిస్తారు డాక్టర్లు.

ఫహాద్ ఫాజిల్ సినిమాలు

రీసెంట్ గా మంజుమ్మేల్ బాయ్స్ అనే మలయాళ మూవీతో నిర్మాతగా భారీ లాభాలను జేబులో వేసుకున్న ఫహాద్ ఆవేశం మూవీతో హీరోగా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన పుష్ప 2 మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు