Hema On Drugs Case : మొత్తానికి తప్పు ఒప్పుకుంది… అలాగే కరాటే కళ్యాణికి ఇచ్చి పడేసింది

Hema On Drugs Case : బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు ఇండస్ట్రీ నుంచి సీనియర్ నటి హేమ పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హేమ తన తప్పును ఒప్పుకుంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అంతేకాదు ఈ వివాదంలో తనపై కామెంట్స్ చేసిన మరో నటి కరాటే కళ్యాణికి కూడా ఇచ్చి పడేసింది. అసలు హేమ తాజా వీడియోలో చేసిన కామెంట్స్ ఏంటో చూద్దాం.

తప్పు చేయకపోవడానికి దేవుళ్ళమా?

రేవ్ పార్టీలో తన పేరు బయటకు వచ్చినప్పటి నుంచి దాన్ని కవర్ చేయడానికి హేమ కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టింది. బిర్యానీ, ఆవకాయ్ అంటూ రోజుకో కొత్త వీడియోను వదులుతోంది. తాజా వీడియోలో హేమ మాట్లాడుతూ “థింక్ పాజిటివ్.. మనం తప్పు చేయనంత వరకూ ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవడేమన్నా, ఎవత్తేమన్నా ఊరుకోవద్దు. మనం తప్పు చేయకపోవడానికి దేవుళ్ళమేమీ కాదు. ఒకవేళ తప్పు చేసినా హార్ట్ ఫుల్ గా సారీ చెప్తే ఫ్రెష్ గా ఉంటాము. అందుకే 99 % అబద్దాలు చెప్పకపోవడం మంచిది. అందుకే నేను ఎప్పుడూ హ్యాపీగా ఉంటాను” అంటూ తాను తోటలో ఉన్నాను అన్పించేలా మరోసారి వీడియోను పోస్ట్ చేసింది. కానీ పోలీసులు మాత్రం ఆమెకు నోటీసులు జారీ చేయడంతో దొరికిపోయాక కూడా ఇంకా కవరింగ్ ఎందుకు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నో షూటింగ్స్

వీడియోలో హేమ షూటింగుల గురించి కూడా ప్రస్తావించింది. మరో 3-4 నెలలు షూటింగులు ఉండవని చెప్పింది. ప్రస్తుతం ఎమర్జెన్సీ షూటింగులు మాత్రమే జరుగుతున్నాయని వెల్లడించింది.

- Advertisement -

Bangalore Rave Party లో షాక్ ల మీద షాక్ లు.. తికమకలతో పోలీసులకు చుక్కలు |  Oneindia Telugu

హేమాపై కరాటే కళ్యాణి కామెంట్స్

తాను ఫ్రెండ్స్‌తో సరదాగా పేకాడుకుంటుంటే, అది ఎవరో పట్టిస్తే ఏదో పెద్ద నేరంలాగా మాట్లాడిన హేమక్క ఈరోజు ఏం చేసింది ? ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్‌తో దొరికింది. మనిషిని ఒక మాట అనేముందు కర్మ రిటర్న్స్ అంటారు. మనం చేసిందే మనకు తిరిగి వస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా? అంటూ కరాటే కళ్యాణి హేమాపై కామెంట్స్ చేసింది. ఆ తరువాత మా ప్రెసిడెంట్ గా ఉన్న మంచు మనోజ్ ఆమె పరువు దిగజారేలా ఎవ్వరూ కామెంట్స్ చేయకూడదు అంటూ ఆదేశించడంతో మళ్ళీ నోరు మెదపలేదు కళ్యాణి.

సీసీబీఐ నోటీసులు

ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ విషయంలో ఈరోజు విచారణకు హాజరుకావాలని నటి హేమ సహా 8 మందికి నోటీసులు అందాయి. నోటీసులు జారీ చేసిన అధికారులు ఈరోజు సీసీబీఐకి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న 101 మందిలో 86 మంది రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది. నటి హేమతో సహా ఎనిమిది మంది డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అందుకే ఆ ఎనిమిది మందిని వ్యక్తిగతంగా హాజరుకావాలని సీసీబీ నోటీసులు ఇచ్చింది. రేపటి నుంచి మరింత మందికి సీసీబీ నోటీసులు ఇవ్వనుంది. ఆంధ్రాలో కొందరు రాజకీయ నాయకుల పిల్లలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

హేమకు నోటీసులు

ఇప్పటికే వైద్య పరీక్షల నివేదికలో డ్రగ్స్ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయింది. వైద్య పరీక్షల్లో ఆమె ఎండీఎంఏ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో హేమపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆమె విచారణకు హాజరుకాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే మరో కేసు వేసే అవకాశం ఉంది. దాడి జరిగిన రోజు కూడా తాను పార్టీలో లేనని, హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఉన్నాను అంటూ వీడియో షేర్ చేసింది హేమ. రేవ్ పార్టీలో తెలుగు తారలు హేమ, ఆషి రాయ్ డ్రగ్స్ సేవించినట్లు తేలింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు