కొరటాలని కంగారు పెడుతున్న యంగ్ టైగర్!!

తెలుగు స్టార్ డైరెక్ట‌ర్ కొరటాల శివ, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్ లో త్వ‌ర‌లోనే ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రీ- ప్రొడ‌క్షన్ ప‌నులు కూడా ఇప్ప‌టికే ప్రారంభం అయ్యాయి. ఎన్టీఆర్ కోసం కొరిటాల శివ.. ఒక ప‌వ‌ర్ ఫుల్ క‌థ‌ను సిద్ధం చేశాడ‌ని వినికిడి. స్టుడెంట్ పాలిటిక్స్ నేప‌థ్యంలో సాగే ఒక యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ ను త్వ‌ర‌లోనే తెర‌కెక్కించ‌డానికి కొరిటాల శివ సర్వం సన్నద్ధం చేసాడు. ఈ సినిమాకు సంబంధించి పాత్రల ఎంపిక కూడా ఇప్ప‌టికే జ‌రుగుతుంది. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీప‌కా ప‌దుకునె కూడా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.

ఈ చిత్రం పట్టలైన ఎక్కకముందే, కే జి ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించేసాడు. అటు ప్రశాంత్ నీల్ కూడా సాలార్ పనులు ముగించుని, ఎన్టీఆర్ కోసం ఒక మాస్ క‌థ‌ను సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తుంది.

కేజీఎఫ్ లాంటి దుమ్ములేపే క‌థ ఉండటంతో ఎన్టీఆర్.. త్వ‌ర‌గా కొరిటాల శివ‌తో చేస్తున్న సినిమాను పూర్తి చేయాల‌ని అనుకుంటున్నాడు. అయితే కొరటాల మాత్రం ఇంకా ఆచార్య కి తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. ఇది పూర్తయ్యేదేప్పుడు…నాది మొదలయ్యేదేప్పుడు అని ఎన్టీఆర్ కంగారు పడుతున్నట్లు చుట్టూ ఉన్న సన్నిహితులు చెప్పుకుంటున్నారట. త్వరగా తన సినిమాని మొదలెట్టాలని ఎన్టీఆర్ కొరటలని కోరినట్లు వినికిడి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు