Bollywood: ‘వార్2’ అప్డేట్ ని ఈ స్పెషల్ డే రోజు చెప్పనున్నారా?

Bollywood:

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన “వార్” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగేళ్ళ కిందట రిలీజ్ అయిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించినా, టైగర్ ష్రాఫ్ నెగిటివ్ టచ్ ఉన్న రోల్ లో నటించాడు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా వార్2 తీస్తున్నామని కొన్ని నెలల కిందట మూవీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇంకా ఆ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హీరోగా నటిస్తున్నాడని అనౌన్స్ చేయడం జరిగింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోయే ఆ సినిమాని బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తాడని చెప్పడం జరిగింది. ఇక మొదటి పార్ట్ ని దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ అయ్యాక మళ్ళీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ చిత్ర యూనిట్ ఇవ్వలేదు. సరైన సందర్భం కోసం వేచి చూస్తున్నారా? లేక మూవీ క్యాస్ట్& క్రూ ని డిసైడ్ చేస్తున్నారా తెలీదు, గాని సినిమా అప్డేట్ మాత్రం ఇవ్వలేదు.

అయితే తాజాగా రానున్న స్పెషల్ డే రోజు వార్ 2 గురించి ఏదైనా అప్డేట్ ఇవ్వొచ్చని టాక్ నడుస్తుంది. అదేంటంటే వార్ సినిమా 2019 లో అక్టోబర్2 న నాలుగేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా వార్2 సినిమా అప్డేట్ ని మూవీ మేకర్స్ ఇవ్వనున్నారని సమాచారం. ఒకవేళ అప్డేట్ ఇచ్చినా ఆ సినిమా కార్యరూపం దాల్చి రిలీజ్ అవ్వడానికి 2024 చివరి వరకు వేచి చూడాల్సి వస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు