#NTR30: ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్ ని అధిగమిస్తాడా..?

కొన్ని విషయాల్లో సెంటిమెంట్ బలంగా పని చేస్తుంటుంది, మరీ ముఖ్యంగా సినిమాల విషయంలో సెంటిమెంట్ ఫ్యాక్టర్ ని గట్టిగా నమ్ముతుంటారు. ఇండస్ట్రీలో అందరూ నమ్మేది, పైగా చాలా సందర్భాల్లో ప్రూవ్ అయిన సెంటిమెంట్ రాజమౌళి సెంటిమెంట్. ఎంత స్టార్ హీరో  అయినా రాజమౌళి సినిమాలో నటించిన తర్వాత నటించిన సినిమా ఫ్లాప్ అవుతుంది. ఈ పరిస్థితి రాజమౌళితో పని చేసిన ప్రతి హీరో ఫేస్ చేశారు. రాజమౌళి ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెం: 1, ఇది ఎన్టీఆర్ కెరీర్లో ఫస్ట్ హిట్ సినిమాగా చెప్పచ్చు. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా సుబ్బు డిజాస్టర్ గా మిగిలింది. సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా, యమదొంగ తర్వాత కంత్రి ఈ వరుసలో నిలుస్తాయి.

తర్వాత రామ్ చరణ్ సినిమాలను గమనిస్తే రాజమౌళి, రామ్ చరణ్ కాంబోలో వచ్చి అప్పట్లో రికార్డులు తిరగరాసిన సినిమా మగధీర తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా ఆరెంజ్ డిజాస్టర్ అయ్యింది. RRR తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కూడా ఈ సెంటిమెంట్ బారిన పడి డిజాస్టర్ అయ్యింది.ఇలా చెప్పుకుంటూ పోతే రాజమౌళితో పని చేసిన ప్రతి హీరోకి తరువాత ఒక డిజాస్టర్ ఉంటుంది. RRR తర్వాత రామ్ చరణ్ డిజాస్టర్ ఫేస్ చేస్తే, ఇప్పుడు ఎన్టీఆర్ కి కూడా ఈ సెంటిమెంట్ ఎఫెక్ట్ పడుతుందా లేదా అధిగమిస్తాడా అన్నది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఇందులో ఇంకొక కామన్ పాయింట్ ఏంటంటే RRR సినిమా తర్వాత రామ్ చరణ్ కి డిజాస్టర్ ఇచ్చింది కొరటాల, ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా చేస్తోంది కూడా కొరటాల డైరెక్షన్లోనే. హీరోలతో పాటు ఇప్పుడు కొరటాలకి కూడా రాజమౌళి సెంటిమెంట్ పరీక్షగా మారింది. ఆచార్య సమయంలో చిరంజీవి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయబోతున్నాం అని గట్టిగా చెప్పినప్పటికీ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు కొరటాల ఎన్టీఆర్ సినిమా మీద కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ ను మాత్రం ఈ భయం వెంటాడుతూనే ఉంది. మరి, ఇప్పటికే ఎన్టీఆర్ కి రెండు సార్లు రాజమౌళి సెంటిమెంట్ ఎఫెక్ట్ పాడగా మూడోసారి దీన్ని అధిగమిస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు