VV Vinayak – Chiranjeevi: హ్యాట్రిక్ కాంబో సెట్ అవుతుందా ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో మంచి విజయం అందుకున్న కత్తి సినిమా రీమేక్ మూవీ “ఖైదీ నెంబర్ 150” తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిట్ అయింది. అయితే మెగాస్టార్ కమ్ బ్యాంక్ కాబట్టి అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. కానీ, ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.

నిజానికి వివి వినాయక్.. మాస్ సినిమాలకు పెట్టింది పేరు. ఈయన దర్శకత్వంలో ఇప్పటికే చిరంజీవితో ఠాగూర్ మూవీ వచ్చింది. ఈ సినిమా ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ, ఖైదీ నెంబర్ 150 అంతటి విజయం సాధించలేకపోయింది. ఇక ఖైదీ నెంబర్ 150 తర్వాత సాయి ధరమ్ తేజ్ తో ఇంటలిజెంట్ అనే సినిమా తీసి డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు వివి వినాయక్. ఆ తర్వాత చత్రపతి హిందీ రీమేక్ స్టార్ట్ చేశారు. ఈ చిత్రం పూర్తి కావడానికి చాలా సమయం పట్టింది.

ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవితో వివి వినాయక్ మరోసారి సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీకి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. సరైన కథ వస్తే చిరు భోళా శంకర్ తర్వాత వచ్చే సినిమా వివి వినాయక్ దర్శకత్వంలోనే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇది సెట్ అయితే, చిరంజీవి – వినాయక్ కాంబినేషన్ లో వచ్చే హైట్రిక్ మూవీ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు