LavanyaKonidela: పార్టీలు, ఫంక్షన్లు అయిపోయాయి.. ఇక షికార్లే..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెద్దల అంగీకారంతో లాస్ట్ మంత్ గ్రాండ్ గా ఫారిన్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ ప్రేమ జంట వెంటనే ఇంటికి తిరిగి వచ్చేసారు. వచ్చాక ఇక్కడ పెళ్ళికి రాని పెద్దలందరికి గ్రాండ్ గా పార్టీలు ఇచ్చారు.

ఇక గత నెల రోజులుగా వరుణ్ లావణ్య పార్టీలు, ఫంక్షన్ల తో గడిపేస్తూ ఉన్నారు. ఇటు వరుణ్ కూడా పెళ్లి కోసం తన చేస్తున్న సినిమాలన్నీ షూటింగ్ లకు వాయిదా వేసేశాడు. అందుకే డిసెంబర్ లో రావాల్సిన వరుణ్ ఆపరేషన్ వాలంటైన్ కూడా పోస్టుపోన్ అయిపోయింది.

అయితే కొన్ని రోజులుగా పార్టీలు, ఫంక్షన్ల లో మునిగిపోయిన ఈ ప్రేమ జంట ఇక షికార్లకు బయల్దేరారు. వరుణ్ తో కలిసి ఎయిర్ పోర్ట్ లో ఉన్న లావణ్య ట్రావెలింగ్ లో ఉన్నట్టు ఇంస్టాగ్రామ్ పేజీ ద్వారా చెప్పింది. చూస్తూనే హనీమూన్ వెకేషన్ అని తెలుస్తూనే ఉంది. మరి వీటన్నిటిని ఫినిష్ చేయడానికి వరుణ్ కి ఇంకెన్ని రోజులు పడుతుంది అంటూ వరుణ్ తో సినిమా చేస్తున్న నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు.

- Advertisement -

ఇక లావణ్య ఇంకా ఏ సినిమాలు కమిట్ కాలేదు గాని, ఇక మీదట చేసే సినిమాలు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తుందని సమాచారం. అటు వరుణ్ వెకేషన్ నుండి రాగానే ఆపరేషన్ వాలంటైన్ షూట్ లో పాల్గొంటాడని సమాచారం.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు