Allu Arjun : యాక్సెప్ట్ చేస్తారా ?

తెలుగు చిత్ర సీమలో ప్రస్తుతం సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో డీజే టిల్లు, బింబిసార, కార్తికేయ తో పాటు పుష్ప సినిమాలకు సీక్వెల్ వస్తుంది. మొదటి భాగానికి ఊహించిన దాని కంటే రెట్టింపు సక్సెస్ రావడంతో దర్శక నిర్మాతలు సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇందులో పుష్ప ది రైజ్ కు సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రూల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ లవర్స్ మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే పుష్ప ది రైజ్ లో అల్లు అర్జున్ లుక్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత చాలా మంది అభిమానులు తమ లుక్ ను పుష్ప రాజ్ గా మార్చుకున్నారు. అంతలా ప్రభావం చేసిన అల్లు అర్జున్ మాస్ లుక్, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది అని చెప్పచ్చు. అయితే సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రూల్ లో ఈ మాస్ లుక్ కనిపించడం కష్టమే అని తెలుస్తుంది.

పుష్ప ది రూల్ లో అల్లు అర్జున్ లుక్ లో కొంత వరకు మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి భాగంలో లాగా పోడవాటి జట్టు, గుబురు గడ్డం, మీసాలు సీక్వెల్ లో ఉండవని, కొంత వరకు వాటిని ట్రిమ్ చేస్తున్నట్టు టాక్. ఈ వార్తలకు బలం చేకూరేలా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కూడా షాట్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. అయితే ఈ కొత్త లుక్ ను మాస్ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అనే సందేహం రాక మానదు.

- Advertisement -

అలాగే పాత ఓల్డ్ స్టైల్ కాకుండా, కొత్త స్టైల్ ను సెట్ చేసేలా డైరెక్టర్ సుకుమార్ ఈ విధంగా ఆలోచిస్తున్నాడు అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పటికే ప్రేక్షకులకు రీచ్ అయిన లుక్ కాకుండా కొత్త లుక్ వల్ల ఏదైన నష్టం అవుతుందా అని కూడా ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉండగా, కొత్త లుక్ ఈ సీక్వెల్ సినిమాను ఎంత వరకు ప్రభావితం చేస్తుందో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు