SSMB28 : ఖలేజా కాంబో రిపీట్ ?

త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. ఇప్పటికే ఈ కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు థియేటర్ లలో సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. కానీ, ఇప్పుడు టీవీలో వచ్చినా జనాలు ఆసక్తి చూపిస్తారు. టీఆర్పీ రేటింగ్ లు కూడా పెరుగుతాయి. ఈ సినిమాలు అంతలా ప్రేక్షకులకు నచ్చాయి. ఖలేజా సినిమా థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ సినిమాలో మహేష్ బాబు పంచ్ డైలాగ్స్, కామెడీ టైమింగ్ ఇప్పటికీ కూడా ఫేమస్.

ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి వస్తున్న విషయం తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఆగస్ట్ లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఖలేజా కాంబోను రిపీట్ చేస్తున్నట్టు సమాచారం. ఖలేజా సినిమాలో మహేష్-సునీల్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఎంతో అలరించాయి. ఇప్పుడు SSMB28 లోనూ అలాంటి కామెడీని చూపించాలని మాటల మాంత్రికుడు ఫిక్స్ అయ్యాడట.

సినిమా మొత్తం కామెడీ సీన్స్ తో కాకుండా, పొలిటికల్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ ను కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. కానీ మహేష్-సునీల్ కామెడీ ఎపిసోడ్స్ సినిమాకు హైలైట్ గా ఉండేలా డిజైన్ చేస్తున్నాడని సమాచారం. ఖలేజా సినిమాలో ఒక్క కామెడీ ట్రాక్ ను మాత్రమే తీసుకుని నడిపించాడు. ఇప్పుడు ఈ సినిమాలో కామెడీ తో పాటు యాక్షన్, ఎమోషన్స్, రాజకీయ అంశాలను తీసుకుని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని త్రివిక్రమ్ చూస్తున్నాడు. మరి త్రివిక్రమ్ ప్రయత్నం ఎంత వరకు సఫలం అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు