Aparichitudu : రీమేక్ కు లైన్ క్లియర్?

కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ గురించి తెలియని వారుండరు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. దీంతో శంకర్ కు ఇమేజ్ కు కూడా పెరిగిపోయింది. ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలని టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు హీరోలు ప్రయత్నించారు. ప్రస్తుతం శంకర్, టాలీవుడ్ లో రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ షూటింగ్ ముగిసన వెంటనే కమల్ హాసన్ తో భారతీయుడు 2 సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. దీంతో పాటు మరో సినిమా కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది.

విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో అపరిచితుడు అనే సినిమా 2005 వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా చియన్ విక్రమ్ కెరీర్ లో మంచి విజయాన్ని నమోదు చేసింది. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్ లోనూ తెరకెక్కించాలని మేకర్స్ అనుకున్నారు. హీరోగా రణవీర్ సింగ్ ను కూడా ఫిక్స్ చేశారు. కానీ నిర్మాత ఆస్కార్ ఫిల్మ్స్ రవి చంద్రన్, శంకర్ మధ్య హిందీ రీమేక్ రైట్స్ విషయంలో విభేదాలు వచ్చాయి. శంకర్ కు రవి చంద్రన్ కోర్టు నుండి నోటీసులు కూడా పంపించాడు.

ఈ వివాదాల మధ్య అపరిచితుడు రీమేక్ పట్టాలెక్కడం కష్టమే అని అందరు అనుకున్నారు. కానీ, హిందీ రీమేక్ పట్టాలెక్కే దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తుంది. రీమేక్ రైట్స్ విషయంలో శంకర్, రవిచంద్రన్ రాజీ పడినట్టు సమాచారం. దీనికి హీరో రణవీర్ సింగ్ మధ్యవర్తిత్వం చేశాడట. ఈ సినిమా వస్తే అందరి కంటే ఎక్కువ లాభం రణవీర్ సింగ్ కే ఉంటుంది. అందుకోసమే, రణవీర్ రిస్క్ చేసి మరీ, సినిమా సెట్స్ పైకి వెళ్లేలా చూస్తున్నాడని బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు