Trisha: డైమండ్ నెక్లెస్ గిఫ్ట్… ఇప్పటికే పెళ్లి అయిన హీరోతో త్రిష పెళ్లికి సిద్ధం

Trisha: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పాతికేళ్ల అమ్మాయిలాగా అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన త్రిష ఇప్పుడు స్టార్ హీరోలతో కలిసి వరుస సినిమాలు చేస్తూ మళ్ళీ పూర్వవైభవాన్ని దక్కించుకుంటుంది అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే త్రిష కి సంబంధించిన వార్తలు రోజుకొకటిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అందులో భాగంగానే త్రిష పెళ్లి గురించి వచ్చిన వార్తలు అందర్నీ మరింత ఆశ్చర్యపరుస్తున్నాయని చెప్పవచ్చు. ఈ మధ్యనే ఒక తమిళ్ నిర్మాతను వివాహం చేసుకోబోతోంది అంటూ ప్రచారం జరగగా.. అది రూమర్ మాత్రమే అని కొట్టిపారేసింది.

అయితే ఇప్పుడు మళ్లీ ఆల్రెడీ పెళ్లైన స్టార్ హీరోని మళ్లీ వివాహం చేసుకోబోతోంది అంటూ మరొక ప్రచారం తెరపైకి వచ్చింది. త్రిష ఇప్పటికే ఎంతోమంది హీరోలతో ఎఫైర్ నడిపించి చివరికి ఎవరిని వివాహం చేసుకోలేదు అన్న రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అంతేకాదు బిజినెస్‌మాన్ వరుణ్ మానియన్‌తో కూడా ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి వరకు వెళ్లింది. కానీ, కొన్ని కారణాలవల్ల విడిపోయింది.

ఇక చాలా కాలం తర్వాత మళ్లీ త్రిష పెళ్లి వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ని త్రిష వివాహం చేసుకోబోతోంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని.. అంతే కాదు విజయ్ కూడా తన భార్యకు విడాకులు ఇస్తున్నాడని వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఇండస్ట్రీలో బాగా వైరల్ అయిన ఈ వార్తలు మళ్లీ ఆగిపోయాయి.

- Advertisement -

ఇప్పుడు తాజాగా ఒక ఫిలిం జర్నలిస్టు… త్రిష కి సంబంధించిన ఒక సీక్రెట్ బయటపెట్టడంతో మళ్లీ ఈ వార్తలు జోరు అందుకున్నాయి. ఆయన మాట్లాడుతూ.. నిజంగానే త్రిష – విజయ్ మధ్య రిలేషన్ ఉంది అని చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ప్రముఖ ఫిలిం జర్నలిస్టు పాండియన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో త్రిష ఇంట్లో ఐడి దాడులు జరిగాయి.. ఆ సమయంలో ఆమె ఇంట్లో రూ.1కోటి విలువ చేసే డైమండ్ నెక్లెస్ దొరికింది .ఈ నెక్లెస్ ఎక్కడిది అని త్రిష ను ఐటి ఆఫీసర్లు ప్రశ్నించగా తనకు విజయ్ బహుమతిగా ఇచ్చాడంటూ చెప్పింది అని..

ఈ విషయాన్ని పాండియన్ బయటపెట్టారు. దీంతో ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది విన్న అందరూ.. వీరిద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తోందని.. అందుకే త్రిష కి ఇంత వయసు వచ్చినా.. ఈమె ఇంకా వివాహం చేసుకోలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే త్రిష దీనిపై స్పందించాల్సి ఉంటుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు