Venky75: సైంధవ్ కోసం చరణ్..!

వెంకటేష్ హీరోగా నటించిన “సైంధవ్” మూవీ రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ చిత్ర యూనిట్ ప్రమోషన్లపై కూడా జోరు పెంచేశారు. హీరో దగ్గర్నుండి మూవీ డైరెక్టర్, నిర్మాతలు ఎవరికి వారు వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడమే గాకుండా, బుల్లితెరపై కూడా ప్రమోషన్లు మొదలెట్టారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్ప్స్, టీజర్ ఒకదాన్ని మించి మరొకటి ఉండి అంచనాలు పెంచేయగా, త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇదిలా ఉండగా సైంధవ్ నుండి పాటలను కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ మూవీ పై ఇంట్రస్ట్ ని పెంచుతున్నారు మేకర్స్. ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ కాగా ఇప్పుడు మూడో పాట రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ పాట కోసం ఏకంగా చరణ్ ని రంగంలోకి దింపారట మేకర్స్. ఈ సినిమా లో తండ్రి కూతుళ్ళ మధ్య ఓ ఎమోషనల్ సాంగ్ ని చరణ్ చేత పాడిస్తున్నారట మేకర్స్. బహుశా మీరేమైనా రామ్ చరణ్ ఈ సినిమాకోసం పాట పాడుతున్నారనుకోవచ్చు.. అలా అయితే మీరు పొరపడినట్టే..

ఈ సినిమా కోసం పాట పాడబోతుంది SP చరణ్. ఇంతకు ముందు చరణ్ బాలయ్య నటించిన భగవంత్ కేసరి లో పాడిన “ఉయ్యాలో” మంచి హిట్ అయింది. ఆ పాట కూడా తండ్రి కూతుళ్ల బాండింగ్ గురించి తెలుపుతూ, మంచి ఫీల్ నిచ్చింది. ఇప్పుడు సైంధవ్ లో కూడా అలాంటి పాటని పాడించారట మేకర్స్. వెంకీ, మరియు తన కూతురిగా నటించిన ఆ చిన్న పాప మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండేలా పాట డిజైన్ చేశారట మేకర్స్. ఇక ఈ న్యూ ఇయర్ కానుకగా ఆ పాటను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక సైంధవ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు