Salaar: వాళ్ళే భయపడాలి… డైనోసార్ పై కన్నడ హీరో షాకింగ్ కామెంట్స్

మోస్ట్ అవైటెడ్ మూవీ “సలార్” డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఒక కన్నడ హీరో చేసిన షాకింగ్ కామెంట్స్ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. వాళ్ళని చూసి నేనెందుకు భయపడాలి? అంటూ ఓ ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట్లో చర్చకు దారి తీసింది. మరి “సలార్”ను చూసి ఈ హీరో ఎందుకు భయపడట్లేదు? అసలు ఈ హీరో “సలార్” మూవీపై ఆ విధంగా ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది? అసలేం జరిగింది అంటే…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. ఈ డైనోసార్ థియేటర్లలోకి ఎంట్రీ కావడం కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అలాగే మిగతా హీరోలు కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అప్పుడు తమ సినిమాలో దరిదాపుల్లో కూడా లేకుండా చూసుకున్నాయి. ఒకానొక సందర్భంలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించాక, పోస్ట్ పోన్ అయితే అదే డేటుకు రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ వెంటనే పోస్ట్ పోన్ అయ్యేలా చూసుకున్నారు నిర్మాతలు. ఆ తర్వాత పలు రిలీజ్ డేట్ లో వెతుక్కున్నారు అది వేరే విషయం అనుకోండి. దీనికి కారణం ప్రేక్షకులకు ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించడం, అలాగే కేజీఎఫ్ తో థియేటర్లకు పట్టిన తుప్పు వదిలించిన దర్శకుడు ప్రశాంత్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండడం. అయితే తాజాగా ఓ కన్నడ స్టార్ హీరో మాత్రం ఈ సినిమాను చూసి భయపడట్లేదట. పైగా వాళ్లను చూసి నేనెందుకు భయపడాలి? ఇది నా సొంత ప్లేస్. నన్ను చూసి భయపడాలి అంటూ కామెంట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

కన్నడ స్టార్ హీరో దర్శన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా రిపోర్టర్ 2 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మీరు భయపడుతున్నారా? అని అడిగారు. ఆ ప్రశ్నకు దర్శన్ స్పందిస్తూ “ఎందుకు భయపడాలి? కర్ణాటక నా సొంత ఊరు, ఇది నా ప్లేస్. వాళ్లే భయపడాలి” అని రిప్లై ఇచ్చాడు. దర్శన్ నటించిన “కాతేరా” చిత్రం కూడా డిసెంబర్ లోనే రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శనం రిపోర్టర్స్ సలార్ మూవీ ని చూసి భయపడుతున్నారా అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా దర్శన్ సమాధానంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతను బాగానే చెప్పాడు. మనకే ఓవరాక్షన్ ఎక్కువ… అన్ని భాషల వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం అని కొంతమంది నొచ్చుకుంటుంటే, మరి కొంతమంది మాత్రం దర్శన్ “సలార్” మూవీని ఎక్కడ మెన్షన్ చేయలేదని తమ అభిమాన హీరోను వెనకేసుకొస్తున్నారు. ఇక కామన్ ఆడియన్స్ మాత్రం అతను చెప్పింది నిజమేనని, అక్కడ అతనే కింగ్ కాబట్టి అతను “సలార్”నీ చూసి భయపడాల్సిన అవసరం ఏముంటుందని? ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ మన దగ్గర ఫలాలతో పాటు ఇతర సినిమాలు రిలీజ్ అయితే మనం ఎందుకు భయపడతాం అని ఉదాహరణలు కూడా చెప్పుకొస్తున్నారు.

- Advertisement -

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు