Animal 2: బంపర్ ఆఫర్ కొట్టేసిన యంగ్ బ్యూటీ.. నిజమేనా..?

యానిమల్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. అంతలా యాక్షన్ సన్నివేశాలతో.. బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకులను పిచ్చెక్కించేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో తన స్ట్రాటజీ చూపించిన ఈయన ఒక్కసారిగా యానిమల్ సినిమాతో తన రేంజ్ ఏంటో చూపించుకున్నారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. డిసెంబర్ ఒకటవ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు సుమారుగా రూ.800 కోట్లకు పైగా వసూలు రాబట్టి రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు.

వీరితోపాటు త్రిప్తి డిమ్రి, బాబీ డియోల్ , అనీల్ కపూర్ తదితరులు కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే . ముఖ్యంగా తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఇందులో సాగిన బోల్డ్ సన్నివేశాలు యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. ఇక ఇలా ప్రేక్షకుల మన్ననలు పొంది భారీ వసూళ్ల తో దూసుకుపోతున్న ఈ సినిమాకు రెండవ పార్ట్ రాబోతోందని దర్శకుడు సందీప్ రెడ్డివంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా యానిమల్ రెండో భాగం పేరు యానిమల్ పార్క్ అని కూడా ఆయన తెలిపారు. ఇక హిందీలో చిత్రీకరించిన ఈ సినిమాని తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయగా.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది

రెండవ పార్ట్ ని కూడా ఇదే రేంజ్ లో తెరకెక్కిస్తామని ధీమా వ్యక్తం చేశారు సందీప్ రెడ్డి వంగ. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక కీలకమైన అప్డేట్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సెకండ్ పార్ట్ హీరోయిన్ గురించి ఆసక్తికరమైన విషయం చెక్కర్లు కొడుతోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. యానిమల్ రెండవ భాగంలో హీరోయిన్ గా మలయాళం బ్యూటీ మాళవిక మోహన్ ఎంపికైనట్లు సమాచారం. సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్డం అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు యానిమల్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుందని.. ఈ సినిమాతో ఆమె ఒక్కసారిగా స్టార్డం తెచ్చుకుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

- Advertisement -

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు