Kalyanram: తండ్రి కోసం కోలీవుడ్ నటుడితో కళ్యాణ్ రామ్ చర్చలు.. సఫలం అవుతాయా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి మంచి క్రేజ్ ఉంది. ఈ కుటుంబం నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. అలాంటి వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఒకరిని చెప్పాలి. అందరి హీరోల లాగా కమర్షియల్ జానర్ సినిమాలు మాత్రమే చేయకుండా కొత్తరకం స్టోరీలతో ప్రేక్షకులను అలరించాలని చూసే కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చారు. అంతే కాదు కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వారి టాలెంట్ ను వెలికి తీస్తున్నారు కళ్యాణ్ రామ్. వాస్తవానికి తన తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా కమర్షియల్ జానర్ సినిమాలు చేసి ఉండి ఉంటే ఈరోజు కళ్యాణ్రామ్ కూడా స్టార్ హీరోగా ఎదిగే వారు .

అప్పుడప్పుడు కమర్షియల్ సినిమాలు చేసి సూపర్ హిట్ అందుకున్నా ఇప్పుడు ప్రతి చిత్రాన్ని ఎంతో ప్రత్యేకంగా భిన్నంగా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది బింబిసారా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత అమిగోస్ చిత్రం తో ముందుకు వచ్చినా.. ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఇక ప్రస్తుతం డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే సినిమాతో ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రీసెంట్గా ఈ సినిమా నుంచి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఒకటి పట్టాలపై ఉండగానే మరో ప్రాజెక్టును చేసుకుంటూ వెళ్తోన్న కల్యాణ్ రామ్.. తన తదుపరి చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాదినేనితో చేయబోతున్నాడని తెలిసింది.

గతంలో ప్రేమ ఇష్క్ కాదల్ , సావిత్రి వంటి సినిమాలు చేసి ఇప్పుడు దయ అనే వెబ్ సిరీస్ తో సత్తా చాటిన పవన్ సాదినేని.. గతంలోనే కళ్యాణ్ రామ్ కోసం ఒక క్రేజీ స్టోరీని రెడీ చేసుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. అంతేకాదు ఈ కథ హరికృష్ణ ఉన్నప్పుడే రాసుకున్నారని.
కళ్యాణ్ రామ్ సినిమాలో హరికృష్ణ కి కూడా ఒక పాత్ర క్రియేట్ చేసినట్లుగా కూడా సమాచారం. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ కథ ఇప్పుడు ఎట్టకేలకు పట్టాలెక్కబోతోంది. మరోవైపు దురదృష్టవశాత్తు హరికృష్ణ మన మధ్య లేకపోయినా ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సిద్ధమైనట్లు సమాచారం. ఇక ఈ కథను వినిపించడానికి నందమూరి కళ్యాణ్ రామ్ తో పాటు పవన్ సాదినేని చెన్నైకి వెళ్లి విజయ్ సేతుపతిని సంప్రదించగా ఆయన కూడా ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం . ఇక ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మించబోతున్నారట. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు