Dhamaka : డబుల్ ధమాకా అదే..

మాస్ మహారాజ రవితేజ.. బాక్సాఫీస్ కు రాజు లాంటోడు. కానీ, రవితేజకు గత కొన్ని రోజుల నుంచి సరైన హిట్ పడటం లేదు. 2021 వరకు ముందు వరుస అపజయాలతో ఉన్న రవితేజ క్రాక్ తో కొంత వరకు ఊపిరి తీసుకున్నాడు. కానీ, ఈ ఒక్క సినిమాతో రవితేజ కోల్పోయిన క్రేజ్ తిరిగి రాలేదు అని చెప్పొచ్చు. క్రాక్ తర్వాత అయినా.. రవితేజ సెట్ అయి వరుసగా హిట్స్ కొడుతాడని అంతా అనుకున్నారు. కానీ, క్రాక్ తర్వాత వచ్చిన ఖిలాడి దారుణంగా నిరాశపరిచింది.

ఇక శరత్ మండవ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే పెద్ద డిజాస్టార్ గా మిగిలిపోయింది. దీంతో రవితేజ ఆశలన్నీ తర్వాత వచ్చే ధమాకా పైనే ఉన్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటలు అంచనాలను పెంచేలా ఉన్నాయి. పోస్టర్లు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

వీటితో పాటు సినిమాలో ఒక అదిరిపోయే ట్విస్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. అదేంటంటే.. మాస్ మహారాజ ఈ రవితేజ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్. అందుకే ఈ సినిమాకు టైటిల్ ను ధమాకా అని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇదే సినిమాలో పెద్ద ట్విస్ట్ గా ఉంటుందట. అలాగే సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే పాత్రగా కూడా ఉంటుందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

- Advertisement -

కొన్ని సందర్భాల్లో మూవీ టీం కూడా డబుల్ ధమాకా అంటూ కొన్ని క్లూలు కూడా ఇచ్చారు. అది కూడా ఈ డ్యూయల్ రోల్ గురించే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ధమాకా లో మాస్ మహారాజా రవితేజ డ్యూయల్ చేస్తున్నాడా ? అసలు సినిమానే మలుపు తిప్పే పాత్ర ఎంటి అని తెలియాలంటే.. ఈ సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు