Radhika Sarathkumar : “యానిమల్”పై రాధిక షాకింగ్ కామెంట్స్… ఏజ్ అయిపోయింది అంటూ నెటిజన్ల సెటైర్లు

సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ గురించి మూవీ లవర్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రాధిక ఇప్పటికీ సినిమాలో తల్లిగా, అత్తగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే, మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రాధిక నటిగా, నిర్మాతగా, సామాజిక కార్యకర్తగా, పరోక్షంగా రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉంటూ ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నారు. మహిళలపై ఎవరన్నా ఎవరన్నా అనుచిత వ్యాఖ్యలు చేసినా, అఘాయిత్యాలు చేసినా అస్సలు ఊరుకోదు ఈ సీనియర్ హీరోయిన్. అంతేకాకుండా ఏ విషయం పైన అయినా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తూ ఉంటుంది. తాజాగా రాధిక సోషల్ మీడియా వేదికగా చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

“ఎవరైనా ఆ సినిమా చూసి విసుగు చెందారా? నాకైతే ఆ మూవీని చూస్తున్నంత సేపు చాలా కోపం వచ్చింది. ఎత్తి పడేయాలి అన్నంత విరక్తి కలిగింది” అంటూ యాంగ్రీ ఎమోజీలను పోస్ట్ చేసింది రాధిక. అయితే ఆమె ఏ సినిమానూ స్పెషల్ గా మెన్షన్ చెయ్యనప్పటికీ, నెటిజెన్లు మాత్రం “యానిమల్”నే రాధిక టార్గెట్ చేసిందని అంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఓటీటిలోకి వచ్చిన సినిమాల్లో “యానిమల్” కూడా ఒకటి. గత ఏడాది డిసెంబరు 1న థియేటర్లోకి వచ్చిన “యానిమల్” మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 900 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన ఈ సినిమాలో మహిళలకు ఏమాత్రం విలువ ఇవ్వలేదంటూ, పురుషాధిక్యతను ప్రోత్సహించేలా మూవీ ఉందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇక సాధారణంగానే ఫెమినిస్ట్ అయిన రాధిక “యానిమల్” మూవీని చూసే ఇలా రియాక్ట్ అయ్యిందని అంటున్నారు. సినిమాలో కొన్ని చోట్ల అమ్మాయిల్ని తక్కువ చేసి చూపించడానికి ఆమె సహించలేకే ఇలాంటి కామెంట్స్ చేసింది అని టాక్ నడుస్తోంది.

కొంతమంది నెటిజన్లు మాత్రం ఆమె ఏ సినిమా గురించి కామెంట్ చేసిందో అర్థం కావట్లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ఓటిటిలో రిలీజ్ అయిన సినిమాల్లో యానిమల్ తో పాటు సలార్ కూడా ఉంది. అందుకే ఆమె ఏ సినిమాపై ఈ కామెంట్స్ చేసింది అనే విషయాన్ని తేల్చుకోలేకపోతున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం ఇటీవల ఆమె కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ “వీర సింహారెడ్డి” సినిమాలో చేసిన ఓవర్ యాక్షన్ చూసి ఇలా అంటున్నారేమో అని, ఏజ్ అయిపోయింది కదా ఇలాగే అన్పిస్తుంది అంటూ వ్యంగంగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు