Tej: విరూపాక్ష కి పాజిటివ్ బజ్ – తేజ్ కి హిట్ ఖాయమేనా..?

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కార్తీక్ దండుల కాంబినేషన్లో విరూపాక్ష సినిమా విడుదల సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 21న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తోంది సినిమా యూనిట్. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన రోజు నుండి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయిన సినిమాకు బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలోనే జరుగుతోందట. యాక్సిడెంట్ నుండి రికవర్ అవ్వటానికి చాలా సమయం పట్టడంతో తేజ్ చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. గ్యాప్ తర్వాత వస్తున్న తేజ్ కి ఈ సినిమా కమ్ బ్యాక్ మూవీ అవ్వాలని మెగాఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

విరూపాక్ష సినిమా నైజాం బిజినెస్ బట్టి చుస్తే తేజ్ ఈ సారి హిట్ అందుకోవటం ఖాయమనే అనిపిస్తోంది. నైజాం ఏరియాలో సుమారు 6.5కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ సినిమాకు డీసెంట్ టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి లాభాల పట్టే అవకాశం ఉంది. మిగతా ఏరియాల్లో కూడా ఈ సినిమా బిజినెస్ కి సంబంధించి డీసెంట్ నంబర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంచి టాక్ సొంతం చేసుకుంటే విరూపాక్ష టార్గెట్ రీచ్ అవటం సులభమే అని చెప్పాలి. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తేజ్ తన కెరీర్లో నటించిన మొదటి సస్పెన్స్ థ్రిల్లర్ కావటంతో సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సెన్సార్ నుండి A సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమాలో హార్రర్ అండ్ వైలెంట్ సీన్స్ మోతాదుకు మించే ఉంటాయని అనిపిస్తుంది. సాయి ధరమ్ తేజ్ మంచి కంటెంట్ ఉన్న కథలు మాత్రమే చేయాలని వెయిట్ చేసి మరి తీసిన ఈ సినిమా అంచనాలను అందుకొని తేజ్ కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఏప్రిల్ 21వరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు