Cirkus: పూజా హెగ్డే పరిస్థితి అంత దారుణంగా తయారైందా..?

సమయం ఎప్పుడు ఎవరికి ఒకేలా ఉండదు. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే సమయం అనేది ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. హీరోయిన్ కెరీర్ ఎంత తొందరగా ఊపందుకుంటుందో.. అంతే తొందరగా డౌన్ అవుతుంది. ఇలా ఎంతోమంది హీరోయిన్ల కెరీర్ల విషయంలో ఇది జరిగింది. వరుసగా హిట్స్ ఇవ్వడం.. ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోవడం హీరోయిన్లకు కామన్. ఇప్పుడు పూజా హెగ్డే పరిస్థితి కూడా ఆ దశలోనే ఉందంటున్నారు చాలామంది.

పూజ హెగ్డే పరిస్థితి ఈమధ్య ఏం బాలేదు. ఒకప్పుడు ఈమె పట్టిందల్లా బంగారం అయింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి విరుద్ధంగా తయారయింది. ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. అంతేకాకుండా చేతిలో ఉన్న సినిమాలు కూడా చేజారిపోతున్నాయి. ఏడాదికాలంగా పూజా హెగ్డేను దురదృష్టం వెంటాడుతుంది. ఈమెకు ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకు వరుసగా నాలుగు ఫ్లాపులు వచ్చాయి. తాజాగా వచ్చిన సల్మాన్ సినిమాతో ఈ ప్లాపుల సంఖ్య 5 కి చేరింది. దీంతో పూజా హెగ్డే పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణమైన స్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఒకప్పుడు పూజ హెగ్డే ఫోటోషూట్ చేస్తే క్షణాలలో వైరల్ అయ్యేవి.

కానీ ఇప్పుడు ఆమె ఎంత ఎక్స్పోజింగ్ చేసినా కుర్రకారు అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ ఒక్క ప్రూఫ్ చాలు పూజా హెగ్డే కెరీర్ పతనం అయిపోయిందని చెప్పడానికి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. ఏది ఏమైనా పూజ మళ్లీ కెరీర్ లో దూసుకుపోవాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఖచ్చితంగా రెండు హిట్లయినా అందుకోవాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు