Payal Rajput : మంగళవారం” సక్సెస్ తో స్టార్ హీరో సరసన మూవీ ఛాన్స్ కొట్టేసిన పాయల్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది నటీనటులు వాళ్ళకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తుంటారు. ఈ క్రమంలోనే అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగులో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందిన పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మంచి ఫామ్ లో ఉంది. మొదటి సినిమాలోనే బోల్డ్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి.

ఆ తరువాత ఆర్డిఎక్స్ అనే సినిమాలో నటించింది. అనంతరం వెంకటేష్ తో కలిసి వెంకీ మామ, మాస్ మహారాజా రవితేజతో కలిసి డిస్కో రాజా, మంచు విష్ణు తో కలిసి జిన్నా వంటి సినిమాలలో నటించింది. ఇక ఇప్పుడు తన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలోనే మంగళవారం అనే సినిమాలో లీడ్ రోల్ పోషించింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ సక్సెస్ తో పాయల్ కి ప్రస్తుతం వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయట.

ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో ఈమెకు ఓ లీడ్ లో నటించే అవకాశం వచ్చిందంటూ ఓ న్యూస్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమెకు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీలో అవకాశం ఇచ్చినట్లు వివరించారట. దీంతో ఇటు మంగళవారం మూవీ హిట్ కావడం, అటు అల్లు అర్జున్ మూవీలో అవకాశం రావడంతో రెండు విషయాలు ఆమెకు ఎంతగానో సంతోషాన్ని కలిగించాయట.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు