Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫస్ట్ వైఫ్ నందిని ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది అగ్ర హీరోలు ఉన్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిరంజీవి తమ్ముడు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటున్నారు. తక్కువ సమయంలోనే పవన్ కళ్యాణ్ తన మార్కును చూపించి .. ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నారు. చిరంజీవి కూడా సినిమాలను వదిలేసి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం గతంలో జరిగింది. అందుకు అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు.

అలా అప్పటి నుంచి రాజకీయాలలో చురుకుగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీని స్థాపించి ప్రజలలో తన పార్టీ హవా చూపించాలని పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదిలా వుండగా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఏం చేసినా కూడా అది ఒక సెన్సేషనల్ అయ్యేదని చెప్పవచ్చు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఇండస్ట్రీలోకి మొదటిసారిగా హీరోగా పరిచయమయ్యారు. ఆ సినిమాలో కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని తనదైన మార్కుని సైతం ఇండస్ట్రీలో చూపించడం జరిగింది పవన్ కళ్యాణ్.

ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది..ఇకపోతే 1995 లో అంటే సినిమాల్లోకి రాకముందే పవన్ కళ్యాణ్ వైజాగ్ అమ్మాయి అయిన నందిని ని ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకోవడం జరిగింది. అయితే అలా వివాహం చేసుకున్న కొద్ది రోజులకి వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో నందిని వాళ్ల పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక 1999లో ఆమె నుంచి విడాకులు కోరగా ఆమె ఇవ్వలేదట. చివరికి 2008 వ సంవత్సరంలో నందిని నుంచి విడిపోవడం జరిగింది.

- Advertisement -

 

అయితే ఈమె విడాకులు అనంతరం యూఎస్ఏ కు వెళ్లిపోయి అక్కడ తన పేరును జాహ్నవిగా మార్చుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె అక్కడ డాక్టర్ కృష్ణారెడ్డిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈమె అమెరికాలోనే స్థిరపడినట్లు.. ఆమె ఆస్తి 200 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నందినికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. మరోపక్క పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.తర్వాత ఈమెకు కూడా విడాకులు ఇచ్చి.. ప్రస్తుతం మూడవ భార్య అన్న లేజినోవా తో తన జీవితాన్ని గడిపేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు