Ironleg Sastri : తన పేరే శాపంగా మారి.. జీవితాన్నే నాశనం చేసుకున్న నటుడు.. ఎవరంటే..?

టాలీవుడ్ లో ఎంతోమంది కమెడియన్స్ కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.. గతంలో ఘనుపూడి విశ్వనాధ శాస్త్రి అనే కమెడియన్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఐరన్ లెగ్ శాస్త్రి అంటే రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రేక్షకులు ఇట్టే గుర్తు పడతారు. మొదట ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కించిన అప్పుల అప్పారావు సినిమాతో తెలుగు తెరకు పరిచయం కావడం జరిగింది.

వెండితెరకు పరిచయమైన తర్వాత ఐరన్ లెగ్స్ శాస్త్రి దాదాపుగా 150కు పైగా సినిమాలలో నటించి మెప్పించడం జరిగింది. ముఖ్యంగా బ్రహ్మానందం ఐరన్ లెగ్ శాస్త్రి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేల చేస్తూ ఉంటాయి. ఇప్పటికీ వీరికి సంబంధించిన సన్నివేశాలు బుల్లితెరపై ప్రసారమయ్యాయి అంటే చాలు ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుతూ ఉంటారు. ఐరన్ లెగ్ శాస్త్రి సొంత ఊరు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం .

ఈయన వృత్తిరీత్యా మంచి పురోహితుడట.. అయితే అలాంటి సమయంలో ప్రముఖ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ తమ సొంత ఊరు అయిన గోదావరి కి వెళ్ళినప్పుడు శుభకార్యానికి హాజరుకాగా అక్కడ పురోహితుడుగా వచ్చిన విశ్వనాథ శాస్త్రి లోని ఉండేటువంటి హాస్య చతురతను తాను గమనించి అప్పుడు రాజేంద్రప్రసాద్ నటిస్తున్న అప్పుల అప్పారావు సినిమాలో కమెడియన్ గా పరిచయం చేశారట. అలా తన మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్న ఈయన .. ఆ సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రి గా నటించి.. అలా ప్రేక్షకుల మదిలో తన పాత్రలతో నిలిచిపోయేలా చేశారు.

- Advertisement -

ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి తన కెరీర్ కి ఎలాంటి డోకా లేదు అనుకున్న సమయంలో ఒక్కసారిగా తనకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడడమే కాకుండా కుటుంబ సభ్యుల సమస్యలు కూడా పెరగడంతో చాలా కృంగిపోయారని.. ఒకానొక సమయంలో తిండి లేక హైదరాబాదు ను వదిలి తన స్వగ్రామానికి వెళ్లిపోగా.. అక్కడ మళ్లీ తిరిగి పురోహితుడు గా చేసేందుకు సిద్ధం కాగా.. ఎవరు కూడా తనని శుభకార్యాలకు పిలిచేవారు కాదట.

అందుకు కారణం తన పేరే ఐరన్ లెగ్ శాస్త్రి అవ్వడం చేత తనని ఎవరు పిలిచేవారు కాదట. దీంతో ఉపాధి కరువై విశ్వనాథశాస్త్రి పలు అనారోగ్య సమస్యలతో వయసు మీద పడడంతో మరణించడం జరిగింది. దీంతో 2006 జూన్ 19న మరణించారు.. గడిచిన కొన్ని నెలల క్రితం ఐరన్ లెగ్ శాస్త్రి కుమారుడు తన తండ్రి మరణం తరువాత ఎదురైన పరిస్థితులను కూడా తెలియజేస్తూ చాలా బాగా ద్వేగానికి లోనయ్యారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు