Nayanthara: డబ్బుల కోసం దిగజారిన నయన్ ?

Nayanthara

స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నయనతార మోడల్గా కెరీర్ ప్రారంభించి 2003 సంవత్సరంలో ఆమె మలయాళ పరిశ్రమలో హీరోయిన్గా అడుగు పెట్టారు. తర్వాత ఆమెకు కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఈ తరుణంలోనే చంద్రముఖి మరియు గజినీ లాంటి చిత్రాలు బ్రేక్ ఇచ్చాయి.

అనంతరం తెలుగులో కూడా ఆమె కెరీర్ ప్రారంభించారు. విక్టరీ వెంకటేష్ చేసిన లక్ష్మీ సినిమాలో హీరోయిన్గా నటించి అందరిని మెప్పించారు నయనతార. ఇప్పటివరకు తన కెరీర్ లో 75 సినిమాలకు పైగా చేసి చరిత్ర సృష్టించారు. నయనతార ఇండస్ట్రీకి వచ్చిన ఈ 20 సంవత్సరాలలో నయనతార పెద్ద మొత్తంలో ఆస్తులు కూడా కూడబెట్టిందట. ఇది ఇలా ఉండగా… నయనతార ఇప్పుడు కొత్త వ్యాపారం స్టార్ట్ చేసినట్టు సమాచారం.

మూవీస్ లోనే కాకుండా పలు వ్యాపారాలు కూడా మొదలు పెడుతున్నారు చాలామంది సెలబ్రిటీలు. ఇప్పటివరకు కత్రినా కైఫ్, షాహీద్ కపూర్, హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్, సమంతలతో పాటు విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోని, శిఖర్ ధావన్ వంటివారు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ లుగా ఉన్నారు. ఇంకొందరు సొంత కంపెనీలను స్థాపిస్తున్నారు. తాజాగా నయనతార తన సొంత కాస్మెటిక్ బ్రాండ్ ను ప్రారంభించింది. నయన్ బ్రాండ్ పేరు ‘9 స్కిన్’. దీనికి సంబంధించిన ప్రకటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు