పొలిశెట్టి ఎందుక‌య్య అంత భ‌యం..!

టాలీవుడ్ లో టాలెంట్ ఉన్నా.. త‌క్కువ గుర్తింపు వ‌చ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి కూడా ఒక‌రు. ఏజెంట్ సాయి శ్రీ‌నివాస్ ఆత్రేయా, జాతి ర‌త్నాలు న‌వీన్ పొలిశెట్టి కు మంచి హిట్ అందించాయి. ఈ రెండు సినిమాల‌తో ఈ జోగిపేట్ శ్రీ‌కాంత్.. స్టార్ డ‌మ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాలు హిట్స్ అందుకోవ‌డంతో సీనియ‌ర్ హీరోలు కూడా పొలిశెట్టి పై ప్ర‌శంస‌లు కురిపించారు.

ఈ ఫామ్ లో న‌వీన్ వ‌రుస‌గా సినిమాలు లైన్ లో పెట్టేస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. న‌వీన్ పొలిశెట్టి ప్ర‌స్తుతం రెండు సినిమాల‌కే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. అనుష్క శెట్టితో మిస్ శెట్టి.. మిస్ట‌ర్ పొలిశెట్టి, సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై అన‌గ‌న‌గా ఒక రాజు సినిమాలు అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమాలు ప్ర‌క‌టించి రోజులు గ‌డుస్తున్నా.. ప‌ట్టాలు మాత్రం ఎక్క‌డం లేదు. ఇవి సెట్స్ పైకి వెళ్ల‌డానికి ఇంకా టైం పట్టేట్టు ఉంద‌ని ఇండ‌స్ట్రి వ‌ర్గాల టాక్. ఆ లోపు మ‌రిన్నీ స్టోరీల‌ను ఎంపిక చేస్తున్నాడా.. అంటే అది లేదు.

న‌వీన్ పొలిశెట్టికు స్టోరీలు ఎంచుకోవ‌డం రాద‌ని, అందుకే ప్ర‌తి సినిమాకు మ‌ధ్య‌లో చాలా గ్యాప్ తీసుకుంటున్నార‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్ అంటున్నారు. ఆ భ‌యం త‌గ్గిస్తే.. పొలిశెట్టి కెరీర్ మ‌రోలా ఉంటుంద‌ని చెబుతున్నారు. కాగ న‌వీన్.. గ‌త హీరోల‌ను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. అయితే పొలిశెట్టి తీరు క‌లిసొస్తుందా.. లేదా అనేది ఆయ‌న సినిమాలు విడుద‌ల అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు