అవ‌తార్ – 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

హాలీవుడ్ లో 2009 లో వ‌చ్చిన అవ‌తార్ ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో ప్ర‌పంచానికి మొత్తం తెలుసు. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీ సంచ‌ల‌నాలు సృష్టించింది. సినీ ల‌వ‌ర్స్ ను కొత్త ప్ర‌పంచానికి తీసుకెళ్లింది. హాలీవుడ్ అంటే తెలియ‌ని వారు కూడా ఈ సినిమా కోసమే తెలుసుకున్నారు. ఇంగ్లీష్ రాని వాళ్లు కూడా అవ‌తార్ ను చూడ‌టానికి వెన‌కాడ‌లేరు. ఒక్క భాష అని కాకుండా.. ప్ర‌పంచం మొత్తం అవ‌తార్ పేరు మార్మోగింది. ఈ సినిమా డైరెక్ట‌ర్ జేమ్స్ కామెరూన్ ను ద‌ర్శ‌కులకే దేవుడు అంటూ స‌లాం చేశారు. అంత‌టి హిట్ అందుకున్న అవ‌తార్ దాదాపు రూ. 19 వేల కోట్ల‌ను సంపాదించుకుంది.

వ‌ర‌ల్డ్ మొత్తం అవ‌తార్ మానియా నుంచి బ‌య‌ట‌కు రాక‌ముందే.. డైరెక్ట‌ర్ జేమ్స్ కామెరూన్ సీక్వెల్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు. అనేక కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా 12 ఏళ్ల పాటు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు అవ‌తార్ -2 మూవీ యూనిట్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. ఈ ఏడాది చివ‌ర్లో డిసెంబ‌ర్ 16వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అంతే కాకుండా ఈ మూవీ గురించి మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని తెలిపింది.

ఈ సినిమాను ఏకంగా 160 భాషాల్లో విడుద‌ల చేస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. దీంతో ఒక్క సినిమా ఇన్ని భాషాల్లో రిలీజ్ చేయ‌డం ఇదే తొలిసారి అవుతుంది. కాగ అవ‌తార్ పార్ట్ 1 బీభ‌త్సం సృష్టించిన నేప‌థ్యంలో అవ‌తార్-2పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ మూవీ ఏకంగా 250 మిలియ‌న్ డాల‌ర్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు