కన్నడ ఇండస్ట్రీలో డాక్టర్ రాజ్ కుమార్ సినీ ప్రస్థానం ఒక రేంజ్ లో ఉంటుంది. ఆయన చిత్ర పరిశ్రమలో సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కాదు. ఆయన తర్వాత వచ్చిన శివ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. కన్నడ ఇండస్ట్రీని ఏలేశారు. వీరికి రికార్డుల అన్ని కూడా సలాం కొట్టాయి. ఇటీవల మరణించిన పునీత్ రాజ్ కుమార్ నటనతో పాటు సమాజ సేవతో ఎంతో మంది గుండెల్లో నిలిచాడు.
పునిత్ మరణం తర్వాత.. రాజ్ కుమార్ నట వారసత్వం కొంత వరకు ఢీలా పడే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ… వచ్చేస్తున్నాడు యువరాజు. శివరాజ్ కుమార్ తనయుడు యువరాజ్ కుమార్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం అయింది. కన్నడ చిత్ర పరిశ్రమకు కేజీఎఫ్ తో పాటు ఎన్నో హిట్స్ ఇచ్చిన హోంబలే ఫిలిమ్స్ యువరాజును పరిచయం చేయనున్నట్టు ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
కన్నడ లెజెండరీ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ కుటుంబం నుంచి థర్డ్ జనరేషన్ హీరోను రంగంలోకి దించుతున్నట్టు ప్రకటించింది. పునీత్ రాజు కుమార్ హీరోగా వచ్చిన యువరత్న సినిమా డైరెక్టర్ సంతోష్ ఆనందరామ్ తో ఈ మూవీ చేస్తున్నట్టు హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ఈ అనౌన్స్ తో కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.