Rashmika: టాప్ ప్లేస్ కి చేరుకున్న నేషనల్ క్రష్..!

ఛలో సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం పొంది టాప్ హీరోయిన్ స్థానానికి చేరుకుంది. గత ఏడాది వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రష్మిక నార్త్ లో సైతం ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప 2లో నటిస్తున్న ఈ కన్నడ భామ ఇన్స్టాగ్రామ్ లో అరుదైన ఘనత సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే రష్మిక 38మిలియన్ల ఫాలోయర్స్ ని సొంతం చేసుకొని టాలీవుడ్ హీరోయిన్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది.
ఇటీవల IMDB ప్రకటించిన ప్రఖ్యాత భారతీయ సెలబ్రిటీల లిస్ట్ లో టాప్ ప్లేస్ సాధించి అందరిని ఆశ్చర్య పరిచిన రష్మిక తాజాగా ఈ అరుదైన ఘనత సాధించి తన సత్తా చాటుకుంది. నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ లైన్ సొంతం చేసుకున్న రష్మిక ఆ పేరుని సార్థకం చేసుకుందని తన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక తర్వాత ఇన్స్టా లో 26మిలియన్ల ఫాలోయర్స్ తో సమంత, 23మిలియన్ల ఫాలోయర్స్ తో పూజ హెగ్డే, రకుల్ ప్రీత్, 22మిలియన్ల ఫాలోయర్స్ తో శృతి హాసన్ రేసులో ఉన్నారు.
ఈమధ్య  విడుదలైన పుష్ప2 గ్లిమ్ప్స్ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అవ్వటం వల్ల రష్మిక కి ఇన్స్టాలో ఫాలోయర్స్ గణనీయంగా పెరగటానికి కారణం అని అంటున్నారు. IMDB లిస్ట్ లో టాప్ ప్లేస్ రావటానికి కూడా ఇదే కారణం అని అంటున్నారు. శ్రీవల్లి క్యారెక్టర్ ద్వారా పుష్ప పార్ట్ 1లో అలరించిన రష్మిక పుష్ప పార్ట్ 2లో ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు