ఒకే సినిమాలో నంద‌మూరి హీరోలు..!

టాలీవుడ్ లో నంద‌మూరి హీరోలకు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఎలాంటి జోన‌ర్ సినిమా అయినా.. న‌ట విశ్వ‌రూప చూపించ‌డం నంద‌మూరి హీరోల‌కు సొంతం. ముందు జ‌న‌రేష‌న్ లో బాల‌కృష్ణ‌, ఈ జ‌న‌రేష‌న్ లో తార‌క్.. టాలీవుడ్ ను ఏలేస్తున్నారు. ఎన్టీ రామారావు వార‌స‌త్వానికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా.. ఫాలోయింగ్ ను పెంచుకున్నారు.. ఇటీవల వ‌చ్చిన అఖండ‌, ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ ను బ‌ద్ద‌లు కొట్టాయి. క‌ళ్యాణ్ రామ్ కూడా బింబిసార సినిమాతో ఇండ‌స్ట్రీ హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని ట్రెడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

బాల‌కృష్ణ, తార‌క్, క‌ళ్యాణ్ రామ్ ఒకే వేదిక‌పై ఉంటే.. నంద‌మూరి ఫ్యాన్స్ కు పూన‌కాలే వ‌స్తాయి. ప‌లు సినిమా ఫంక్ష‌న్ వేడుక‌ల్లో ఈ ముగ్గురు ఒకే వేదిక‌ను పంచుకున్నారు కూడా. అయితే ఒకే వేదిక కాకుండా.. ఈ ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో క‌నిపించాల‌ని నంద‌మూరి ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచో ఆశ ప‌డుతున్నారు . గ‌తంలో బాల‌కృష్ణ, క‌ళ్యాణ్ రామ్.. ఎన్టీ రామారావు బ‌యోపిక్ లో న‌టించినా.. తార‌క్ మాత్రం దూరంగానే ఉన్నాడు.

ఇన్నాళ్ల‌కు ఫ్యాన్స్ క‌ల‌లు నిజం అయ్యే రోజు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ల‌తో సినిమా చేయాల‌ని డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు డిసైడ్ అయ్యాడ‌ట‌. అందు కోసం దుమ్ములేపే స్టోరీని కూడా సిద్ధం చేస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి స‌మాచారం. దీనికి ఎన్‌బీకే అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీ టాక్. ఇదే జ‌రిగితే.. నంద‌మూరి అభిమానుల‌కు ఇక పండ‌గే..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు