హిందీ ప్రేక్ష‌కుల‌కు ప్రేమ‌క‌థ‌లు బోర్ కొట్టాయా..?

బాలీవుడ్ లో సినిమాలు చేయాలా.. ఒక ల‌వ్ స్టోరీ, కాస్త ఫ్యామిలీ డ్రామ ఉంటే చాలు.. సూప‌ర్ హిట్ ఖాయమ‌ని నిర్మాత‌లు, డైరెక్ట‌ర్స్ అనుకునేవారు. ఈ జోన‌ర్ లోనే బాలీవుడ్ లో చాలా సినిమాలు వ‌చ్చాయి. దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే నుంచి యే జ‌వానీ హై దీవానీ వ‌ర‌కు ల‌వ్ స్టోరీ సినిమాలు బాక్సాఫీస్ పై క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించాయి. ఒక స్థాయిలో బాలీవుడ్ అంటే.. మెలోడీ డ్రామా సినిమాలే అని ట్యాగ్ కూడా ఉండేది. కాని ఇప్పుడు సీన్ మారిందా..? ల‌వ్ స్టోరీ సినిమాలు హిందీ ప్రేక్ష‌కుల‌కు విసుగుపుట్టిందా..? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తుంది. ఇటీవ‌ల సౌత్ లో రిలీజ్ అయిన భారీ యాక్ష‌న్ సినిమాల‌కు హిందీలో వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తే ఇదే అర్థం అవుతుంది.

సౌత్ నుంచి వ‌రుస‌గా వ‌స్తున్న‌ యాక్ష‌న్ మూవీస్ కు హిందీ ప్రేక్ష‌కులు ఫీదా అవుతున్నారు. ఇప్ప‌టికే అఖండ‌, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు హిందీ మార్కెట్ పై దండ‌యాత్ర చేశాయి. ఇప్పుడు తాజా గా కేజీఎఫ్ చాప్ట‌ర్ – 2 సునామీ సృష్టిస్తుంది. సౌత్ సినిమాల‌కు హిందీ సినీ ఫ్యాన్స్ రెడ్ కార్పెట్ వేసి.. బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దీంతో హిందీ రాష్ట్రాల నుంచి అంచ‌నాల కంటే భారీ క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 హిందీ లో ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 150 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది.

ఇక ఆర్ఆర్ఆర్ అయితే.. ఏకంగా రూ. 200 కోట్ల మార్క్ ను అందుకుంది. అఖండ‌, పుష్ప సినిమాలు కూడా హిందీలో రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్లు చేశాయి. సౌత్ యాక్ష‌న్ సినిమా దెబ్బ‌కు బాలీవుడ్ సినిమాలు మూసుకున్నాయి. సౌత్ యాక్ష‌న్ సినిమాల‌కు హిందీ ప్రేక్ష‌కులు జై కొట్ట‌డాన్ని చూస్తే.. బాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌ను రిజ‌క్ట్ చేసిన‌ట్టే అని సినీ క్రిటిక్స్ అంటున్నారు. బీ టౌన్ ద‌ర్శ‌కులు త‌మ స్టోరీ ల‌ను మార్చ‌కపోతే.. వ్యూచ‌ర్ లో సౌత్ సినిమానే ముందు ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు