మెగాస్టార్ రిజక్ట్ చేసిన స్టోరీతో ర‌వితేజ మూవీ

‘మ‌న పేరు రాసుంటే.. కాస్త లేట్ అయినా తిరిగి మ‌న వ‌ద్దేకే చేరుతుంది’ ఈ సామెత చాలా సార్లు వినే ఉంటారు. దీన్నే.. ‘ఒక స్టోరీ ఒక‌రి కోసం మాత్ర‌మే పుడుతుంది. ఆ స్టోరీతో ఎవ‌రూ సినిమా చేసినా.. సెట్ కాదు. అటు ఇటు తిరిగినా.. చేరాల్సిన వ్య‌క్తి వ‌ద్ద‌కే చేరుతుంది’ అని కూడా చెప్ప‌వ‌చ్చు. ఈ విష‌యం టాలీవుడ్ లో ఇప్ప‌టికే చాలా సార్లు ప్రూఫ్ అయింది. తాజాగా మ‌రోసారి ఈ సామెత క‌రెక్ట్ అని నిరూపించుకుంది. ఎలాగంటే.. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇటీవ‌ల టైగర్ నాగేశ్వ‌ర్ రావు అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త మూవీ ఫేమ్ వంశీ డైరెక్ష‌న్ లో క్రైమ్ డ్రామాగా ఈ సినిమా వస్తుంది. ఇది ర‌వితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా శ‌రవేగంగా పూర్తి చేసుకుంటుంది.

అయితే ఇటీవ‌ల ఈ సినిమాకు సంబంధించిన ఒక కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వ‌చ్చారు. టైగ‌ర్ నాగేశ్వ‌రరావు సినిమా స్టోరీ మొద‌ట త‌న వ‌ద్ద‌కే వ‌చ్చింద‌ని అన్నారు. ఒక దొంగ‌ను హీరో ఎలా చేస్తారని ఆలోచించి.. ఆయ‌న గురించి పూర్తిగా సెర్చ్ చేసిన‌ట్టు తెలిపారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల తాను ఈ సినిమా చేయ‌లేక‌పోయాన‌ని పేర్కొన్నారు. ఈ క‌థ ర‌వితేజ వ‌ద్ద‌కు చేరడం సంతోషమ‌ని అన్నారు. ఈ సినిమా త‌ప్ప‌కుండా సూప‌ర్ హిట్ కొట్ట‌డం ఖ‌య‌మ‌ని జోస్యం చెప్పారు.

ఇలా చిరంజీవి నుంచి మ‌రి కొంత మంది హీరోల వ‌ద్ద‌కు వెళ్లిన ఈ క‌థ.. చివ‌రికి ర‌వితేజ వ‌ద్ద సెటిల్ అయింది. కాగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌కు ర‌వితేజ ఫ‌ర్‌ఫెక్ట్ గా సెట్ అయ్యాడ‌ని చిత్ర బృందం చెబుతుంది. ఈ పాత్ర‌లో మ‌రో హీరోను ఊహించుకోవ‌డం క‌ష్టమ‌ని అంటున్నారు. ఫ‌ర్‌ఫెక్ట్ హీరోల కోసం ఫ‌ర్‌ఫెక్ట్ స్టోరీలు వ‌స్తాయ‌ని ఇలా ప్రూవ్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు