Naa Saami Ranga : నిర్మాతతో నాగ్ అభిప్రాయబేధాలు… అందుకేనా ఈ ఆలస్యం?

Naa Saami Ranga : 2024 సంక్రాంతి సీజన్ కు టాలీవుడ్ లో గట్టి పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు, తేజ సజ్జ, వెంకటేష్ వంటి హీరోలు తమ సినిమాల విడుదల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. కానీ నాగార్జున పరిస్థితి ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేని విధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే “నా సామి రంగ” మూవీ పోస్ట్ పోన్ కాబోతోంది అనే ప్రచారం జోరందుకుంది. మరి ఈ వార్తలు నిజమేనా? నాగార్జున సంక్రాంతి రేసు నుంచి తప్పుకోబోతున్నాడా? అంటే…

ఇప్పటిదాకా “నా సామి రంగ” మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. “నా సామి రంగ” మూవీ రిలీజ్ విషయంలో నిర్మాత, హీరో నాగార్జున మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సమాచారం. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని పట్టుదలతో నాగార్జున పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడి షూటింగ్ చేస్తున్నారు. కానీ మరోవైపు మాత్రం నిర్మాత ఈ మూవీని వాయిదా వేయాలనుకుంటున్నారట.

“నా సామి రంగ” మూవీ 25 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైంది. అయితే నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే సినిమాకు పెట్టిన బడ్జెట్లో 2/3 వంతును రాబట్టుకుంటారు. కాబట్టి కలెక్షన్ల పరంగా ఈ సినిమాకు పెద్దగా టార్గెట్ ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తంగా 200 స్క్రీన్లు దొరికి, సినిమాకు 20 కోట్ల షేర్ వస్తే చాలు లాభాలు అందుకున్నట్టేననే ధీమాతో నాగర్జున ఉన్నారట. అందుకే ఇంత పోటీ ఉన్నప్పటికీ తన సినిమాను రిలీజ్ చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారట.

- Advertisement -

కానీ నిర్మాత మాత్రం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఇంకా ఏడు నుంచి పది రోజుల సమయం పడుతుందని, కేవలం షూటింగ్ మాత్రమే కాకుండా మిగతా పనులు కూడా పూర్తి చేయాలంటే ఇంకా టైం కావాలి. ఇక ఎలాగోలా అనుకున్న సమయంలోపే సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేద్దాం అనుకున్నా కూడా “నా సామి రంగ” మూవీ బాగుంది కాబట్టి ఇంతటి భారీ పోటీలో ఎందుకు హడావిడిగా విడుదల చేయడం అని భావిస్తున్నారట. అంతేకాకుండా మంచి మూవీని 200 స్క్రీన్స్ కే పరిమితం చేసి, కేవలం 20 కోట్ల షేర్ వస్తే చాలు అనుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారట.

ఒకవేళ ఈ మూవీ సోలోగా రిలీజ్ అయితే మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది కాబట్టి తర్వాత రిలీజ్ చేద్దామని ఆలోచిస్తున్నారట. ఇలా “నా సామి రంగ” మూవీ రిలీజ్ డేట్ విషయంలో హీరో, నిర్మాత మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాల వల్ల రిలీజ్ డేట్ ప్రకటించడంలో ఆలస్యం జరుగుతోందని సమాచారం. కానీ ఇప్పటికే ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారంటూ ప్రచారం జరుగుతుంది. రేపటిలోగా “నా సామి రంగ” మూవీ టీం నుంచి వచ్చే అప్డేట్ ఈ విషయం పోస్ట్ పోన్ అయ్యిందా లేదంటే సంక్రాంతి రేసులోనే దిగబోతోందా అనే విషయంపై క్లారిటీ ఇవ్వనుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు