Simbu : మురుగదాస్ పాన్ ఇండియా మూవీ

మురుగదాస్.. బాలీవుడ్ స్టార్స్ సైతం పిలిపించుకొని తమతో ఒక సినిమా చేయాలని అడుగుతారు. కోలీవుడ్ దర్శకులలో భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలను కలిగి ఉన్నాడు మురగదాస్. కమర్షియల్ కథలకు సందేశం జోడించి తెరకెక్కించడంలో ఈ తమిళ దర్శకుడు సిద్ధహాస్తుడు. “గజిని”, “7th సెన్స్”, “తుపాకీ” వంటి విజయవంతమైన చిత్రాలతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు మురుగదాస్. అయితే రజనీకాంత్ తో “దర్బార్” సినిమా తర్వాత మురుగుదాస్ నుంచి మరో సినిమా రాలేదు. దర్బార్ మూవీ మురుగదాస్ ని తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మురుగదాస్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

తాజాగా మురుగుదాస్ మరో సినిమా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. తమిళ హీరో శింబుతో ఓ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం శంబు వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే మురుగదాస్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు చేసేందుకు శింబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. దీన్ని పాన్ ఇండియా సినిమాగా ముస్తాబు చేయనున్నట్లు తెలుస్తోంది. మరి మురుగదాస్ లాంటి స్టార్ దర్శకుడు తో కలిసి శింబు చేస్తున్న ఈ సినిమా తప్పకుండా ఆయన కెరీర్ కు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ చిత్రం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు