Mrunal Thakur: లారెన్స్‌తోనా…? ప్రయోగమా.. పట్టు కోసం పాట్లా..?

Mrunal Thakur: బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్‌కు సీతారామం తర్వాత ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత మృణాల్ పూర్తిగా సౌత్ స్టార్ అయిపోయింది. సౌత్‌లో ముఖ్యంగా తెలుగు ఆడియన్స్‌కి అయితే మృణాల్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. సీతారామం తర్వాత మృణాల్‌కు తెలుగులో ఛాన్స్‌లు ఎక్కువే వస్తున్నాయి. అయితే మృణాల్ ఇప్పుడు సౌత్‌పైన పూర్తిగా గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తోంది.

అందుకు సౌత్‌లోని ఇతర ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతుంది. సీతారామంతో ఇటు తెలుగుతో పాటు మలయాళంలో కూడా మంచి పేరు తెచ్చుకున్న మృణాల్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై కన్నేసింది. ఎలాగైనా తమిళ తంబీలకు దగ్గరై, తన ఫర్మామెన్స్ రుచి చూపించాలని ట్రై చేస్తుంది. అందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుందని టాక్.

అందులో భాగంగా, తమిళంలో లారెన్స్‌తో రొమాన్స్ చేయడానికి మృణాల్ రెడీ అయిపోయిందట. ఒకటి ఏకంగా రెండు సినిమాలు లారెన్స్‌తో చేయడానికి అగ్రిమెంట్ చేసుకుందని కోలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఇప్పుడు లారెన్స్ ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న అయాలన్ మూవీ డైరెక్టర్ రవి కూమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఎంపిక అయినట్టు టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

దీంతో పాటు లారెన్స్ నుంచి రాబోయే మరో సినిమాలో కూడా మృణాల్‌నే హీరోయిన్‌గా ఫిక్స్ చేయబోతున్నారట. ఇలా అయినా, తమిళంలో సెట్ అవ్వాలని పూర్తిగా సౌత్ స్టార్ అవ్వాలని మృణాల్ ట్రై చేస్తుంది. చూడాలి మరి తెలుగు ఆడియన్స్ కు సీతగా దగ్గరైన మృణాల్… తమిళంలో ఎలా నెట్టుకువస్తుందో.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు