Kriti Kharbanda comments viral : పవన్ కళ్యాణ్ హీరోయిన్ గదిలో సీక్రెట్ కెమెరాలు పెట్టించారా..!

Kriti Kharbanda comments viral

బోణి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కృతి ఖర్బందా. కెరీర్ మొదట్లో ఎక్కువగా తెలుగు, కన్నడ చిత్రాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా మొదలైంది, తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం 3 డీ, బ్రూస్ లీ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడే సెటిల్ అయ్యింది.

ఇక ఇటీవల అక్కడ కూడా పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో సినిమాలకు దూరమైంది. అయితే ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తనకి జరిగిన ఓ చేదు అనుభవం గురించి బయటపెట్టింది. “గతంలో ఓ కన్నడ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనని నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఓ హోటల్ లో పనిచేసే ఓ వ్యక్తి నా గదిలో సీక్రెట్ కెమెరా పెట్టాడు.

అయితే హోటల్ రూమ్ లో బస చేసుకోవడం నాకు, నా టీమ్ కి అలవాటు. అలా చెక్ చేస్తుండగా కెమెరా బయటపడింది. సెట్ ఆఫ్ బాక్స్ వెనక అతడు ఉంచిన కెమెరా చూసి చాలా భయపడ్డాను. అప్పటినుండి ఎప్పుడు ఏ హోటల్ లో స్టే చేయాల్సి వచ్చినా చాలా జాగ్రత్తగా ఉంటాను” అని చెప్పుకొచ్చింది. దీంతో కృతి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు