Allu Arjun: పుష్ప 2లో స్టార్ హీరో క్యామియో రోల్ చేస్తున్నాడా..? 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ల కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తర్వాత నార్త్ లో కూడా బ్లాక్ బస్టర్ అయ్యి పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప ది రూల్’ రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన గ్లిమ్ప్స్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. రిలీజ్ ఇంకా చాలా సమయం ఉన్నా కూడా ఈ సినిమాకు సంబంధించి తరచూ ఎదో ఒక అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తూ హీట్ పెంచుతోంది.

ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో క్యామియో రోల్ చేస్తున్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ పుష్ప సెట్స్ కి వెళ్ళటం ఈ వార్తలకి బలం చేకూరుస్తోంది. ఇదే గనక నిజం అయితే ఎన్టీఆర్ క్యామియో అటు నందమూరి ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి స్పెషల్ గా మారే అవకాశం ఉంది. ఇదివరకే ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన RRR సినిమా నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య చిన్నపాటి యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో ఎన్టీఆర్ క్యామియో అనగానే ఇరువురి ఫ్యాన్స్ కి మధ్య వార్ మొదలవుతుందా అన్న అనుమానం కలుగుతోంది.

RRR లో రాజమౌళి ఇద్దరు హీరోలను ఎంత సమానంగా డీల్ చేసినప్పటికీ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కొంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోటీ పడ్డారు. అయితే ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య మంచి బాండింగ్ ఉందని సోషల్ మీడియాలో ఇద్దరి పోస్ట్లు చూస్తే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పుష్ప 2లో ఎన్టీఆర్ క్యామియో ఉంటుందా ఉండదా అన్నది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు