Project K: బిగ్ బాస్ కోసం కమల్ కి భారీ రెమ్యునరేషన్..!

లేటు వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు కమల్ హాసన్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్2 సినిమాలో నటిస్తున్న కమల్ నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ‘ప్రాజెక్ట్ కె సినిమాలో ఇటీవలే జాయిన్ అయ్యాడు. ఈ సినిమా కోసం కమల్ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని వార్తలొచ్చాయి ఆ మధ్య. తాజాగా కమల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమిళ్ బిగ్ బాస్ కోసం కూడా కమల్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని సమాచారం అందుతోంది. ఈ షో కోసం కమల్ ఏకంగా 135కోట్లు ఛార్జ్ చేశాడని అంటున్నారు. తన వయసుకి తగ్గ పాత్రలు ఎంచుకుంటూ భిన్నమైన కథలతో వరుసగా సినిమాలు చేస్తున్న కమల్ మణిరత్నంతో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే, వరుసగా సినిమాలను లైన్లో పెట్టిన కమల్ బిగ్ బాస్ షో ని ఎలా మేనేజ్ చేస్తాడు అన్న ఆసక్తి పెరిగింది. 2024 జనవరి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసిన ఇండియన్2 సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మొదలై చాలా కాలం అవుతున్నప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ఈ సినిమా తర్వాత మణిరత్నంతో చేయబోయే సినిమాను స్టార్ట్ చేస్తాడని సమాచారం. ప్రాజెక్ట్ కె సినిమాలో కమల్ హాసన్ క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న క్రమంలో సినిమాపై అంచనాలు పెరిగాయి. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తోంది సినిమా యూనిట్. మరి, 27ఏళ్ళ కిందట రిలీజ్ అయిన భారతీయుడుకి సీక్వెల్ గా వస్తున్న ఇండియన్2 ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు