Tollywood: 2018 తరహా కథని టాలీవుడ్ మిస్ చేసుకుందా..?

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచి, తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ కూడా కాసుల వర్షం కురిపిస్తున్న 2018. కేరళలో 2018లో వచ్చిన వరదల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజువల్స్ తో ప్రేక్షకులకి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వటంతో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేనప్పటికీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పెద్దగా ప్రమోషన్స్ కూడా లేకుండా విడుదలైన ఈ సినిమా మౌత్ టాక్ తో ఉపందుకొని తొలిరోజు 1.1కోటి రూపాయల వసూళ్లు సాధించగా, రెండో రోజు 1.73కోట్ల గ్రాస్ రాబట్టింది. సైలెంట్ గా రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమాకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావటం, మొదటి రోజు కంటే, రెండో రోజు కలెక్షన్స్ పెరగటం గొప్ప విషయం అనే చెప్పాలి. అయితే, సినిమా చుసిన చాలా మంది తెలుగు ప్రేక్షకులు 1977 నాటి ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ‘దివిసీమ ఉప్పెన’ విపత్తును గుర్తు చేసుకుంటున్నారు.

2018 సినిమా చూసిన అప్పటి తరం వారు దివిసీమ ఉప్పెన నాటి పరిస్థితులు కళ్ల ముందు మెదిలాయని కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దివిసీమ ఉప్పెన బ్యాక్డ్రాప్ లో తెలుగులో 2018 తరహా సినిమా చేసుంటే బాగుండేదన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వెలువడుతోంది. నిజానికి దివిసీమ ఉప్పెన సృష్టించిన విపత్కర పరిస్థితుల గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో సంభవించిన ఆ విపత్తులో పదివేల మందికి పైగా ప్రాణ నష్టం సంభవించిందని అధికారిక లెక్కలు ఉండగా,సుమారు 50వేల మంది వరకు మరణించి ఉండోచ్చని అనధికారిక లెక్కలు ఉన్నాయి. సినిమాలో కంటెంట్ జనాలకి నచ్చితే ప్రేక్షకులు భాషాబేధం లేకుండా ఆదరిస్తారని 2018 సినిమాతో మరోసారి ప్రూవ్ చేసింది.

ఆ రకంగా 2018 తరహా సినిమా రూపొందించేందుకు కథా వస్తువుగా దివిసీమ ఎపిసోడ్ ఉన్నప్పటికీ ఎందుకో తెలుగు ఫిలిం మేకర్స్ కి ఆలోచన కలగలేదని చెప్పాలి. 2018సినిమా చూసాక అయినా డబ్బింగ్ కి బదులు రీమేక్ చేసి ఉన్నా కానీ, ఈ తరం తెలుగు ప్రేక్షకులకు దివిసీమ ఉప్పెన నాటి పరిస్థితులను దృశ్యరూపంలో వీక్షించే అవకాశం కలిగుండేది. మొత్తానికి ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకున్న 2018 సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు