Happy birthday MB: నమ్రత రొమాంటిక్ విషెస్…

Happy Birthday MB… “Namrata” Romantic Wishes

ఇండస్ట్రీలో టాప్ హీరోలు కొందరే. అందులో కొంతమంది యాక్టింగ్ వల్ల టాప్ ప్లేస్‌లో ఉంటారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే యాక్టింగ్‌తో పాటు మంచి పనులు చేస్తూ టాప్ ప్లేస్‌లో ఉంటారు. అలాంటి వాళ్లల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఈ టాప్ హీరో బర్త్ డేను ఈ రోజు ఫ్యాన్స్ గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు. బర్తే డే కానుకగా మహేష్ అల్ టైం బ్లాక్ బస్టర్ మూవీ బిజినెస్ మ్యాన్ ని రి రిలీజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ మొత్తం ఇప్పుడు బాబు నామస్మరణలో ఉన్నారని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా, నమ్రత తన హస్బెండ్‌కి రొమాంటిక్‌గా విషెస్ చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్‌తో రొమాంటిక్‌గా హగ్ చేసుకున్న ఓ పిక్ పెట్టి, Happy birthday MB!! You, you and you for today and every day అంటూ ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. మహేష్‌ని నమ్రత ముద్దుగా ఎంబీ అని పిలిస్తుందనే సంగతి తెలిసిందే.

కాగా, ఈ ఇన్‌స్టా పోస్ట్ తర్వాత మహేష్ – నమ్రత మోస్ట్ లవబుల్ కపుల్ అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే నమ్రత పోస్ట్ చేసిన పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్, KTR సహా పలువురు సినీ,రాజకీయ సెలెబ్రిటీలు మహేష్ బాబుకి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ ని తెలియచేస్తున్నారు. ఇక మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కోసం బిజినెస్ మ్యాన్ సినిమా4k వెర్షన్ థియేటర్లలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ లో బిజీగా ఉండగా, అది పూర్తయిన తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు